సబ్ ఫీచర్

ఆవేశం విడువు ఆలోచనతో నడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆవేశం విడువు ఆలోచన తో నడువు’’అని పెద్దలు చెబుతుంటారు. ఆవేశం వస్తే కోపం వస్తుంది. కోపం వివేకాన్ని నశింపచేస్తుంది. తన కోపమే తన శత్రువు అని శతకకారుడు చెప్పాడు. ఏ పురాణాన్ని చూసినా ఆవేశంతో చేసిన పనులు అనర్థదాయకాలుగానే కనిపిస్తాయి. అదే ఆలోచనతో చేసినవి అర్థానే్న కాదు పరమార్థాన్ని కూడా కలుగచేస్తాయి.
కౌరవులు పాండవులు అన్నదమ్ములైనా వారి మధ్య ఈర్ష్యాసూయలతో పాటు ద్వేషం కూడా రాజుకుంటుంది. కౌరవుల్లో దుర్యోధనుడు పేరుకి పెద్దవాడైనా బుద్ధిలో అందిరి కన్నా తక్కువైనవాడే. దానికి తోడు శకుని మామ, కర్ణుడనే మిత్రుడు, తమ్ముడనే దుశ్శాసనుడు చేరి దుర్యోధనుని బుద్ధిని చెడగొడుతుంటారు. వారు చెప్పింది విని ఆలోచనే లేకుండా ఆవేశంతో ఎన్నో కుయుక్తులు పన్నుతాడు. కాని అవి అన్నీ కూడా విఫలమవుతాయి. అంతేకాదు దుర్యోధనునిడి మరింత అవమానం పాలైట్లు కూడా చేస్తాయి.
అట్లానే రావణుడు కూడా ఆయన చెల్లెలు శూర్పణఖ చెప్పిన విషయాన్ని వింటాడు. మరో ఆలోచనే లేకుండా సీతాపహరణానికి కుట్రలు పన్నుతాడు. దీనికి సాయంగా ఆయనకు ఎదురు చెప్పనివారి సలహాలు తీసుకొంటాడు. మంచి పనికాదు అనిచెప్పిన వారి మాటలను పెడచెవిన పెడుతాడు. దాంతో సీతాపహరణ చేయగలిగాడు. కాని ఆమెను కనీసం తనతో మాట్లాడించుకోలేకపోయాడు. అంతేకాదు రాముని చేతిలో సర్వనాశం చెందాడు. తానే కాదు తన వంశం అంతా నాశనం అయ్యేలా చేసుకొన్నాడు. దీనికి కారణం ఆవేశమే కాని ఆలోచన కాదు.
ఒక్కక్షణం తాను చేస్తున్న పనేమిటో ఒకసారి ఆలోచించి మంచి పనో కాదో వివేకంతో పరిశీలించుకుంటే ఇంత అనర్థం జరిగేది కాదుకదా.
అందుకే నేటి యువత కూడ చేసే పనిని పూర్తిగా అర్థం చేసుకొని దానివల్ల మంచిజరుగుతుందా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించి చేస్తే మంచి జరుగుతుంది. అందుకే పెద్దలు ఆవేశంతో కాక ఆలోచనతో నడువు అంటారు.

- చరణ శ్రీ