క్రీడాభూమి
ముద్దు ఓ సంచలనం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 19:దక్షిణ కొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో ఒక సంచలనం నమోదైంది. అమెరికాకు చెందిన గే ఫ్రీస్టైల్ స్కయర్ గస్ కెన్‌వర్తీ స్లోప్స్టైల్ విభాగంలో పోటీపడి పనె్నండో స్థానానికే పరిమితమైనప్పటికీ అతడు పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచాడు. పోటీ అనంతరం తన బాయ్‌ఫ్రెండ్‌ను ముద్దుపెట్టుకున్న దృశ్యాన్ని కెమెరాల్లో బంధించిన విషయం తెలియని కెన్‌వర్తీ ఇవాళ అన్ని పత్రికల్లో ఆ ఫొటోను చూసి ఉబ్బితబ్బిబయ్యాడు. ఒలింపిక్స్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌ను ముద్దుపెట్టుకోవడం, ఆ దృశ్యాన్ని ప్రపంచం చూడటం అనేది నా చిన్నప్పటి కల. అది నిజమవుతుందని ఎన్నడూ అనుకోలేదు అన్న ఈ 27 ఏళ్ల స్కయర్ చర్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లెక్కలేనన్ని ప్రతిస్పందనలు నమోదవుతున్నాయి. ఒలింపిక్స్ వంటి పోటీల్లో ఒక గే క్రీడాకారుడు తన ప్రియుడికి ముద్దుపెట్టడం అన్నది సంభవమవడం గొప్పవిషయం అని అతడు అభిప్రాయపడ్డారు. ఈ ఒలింపిక్స్‌లో పాల్గొన్న కెనడాకు చెందిన ఎరిక్ రెడ్ఫోర్డ్ స్వర్ణ పతకాన్ని సాధించిన తొలి గే క్రీడాకారుడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ వింటర్ ఒలింపిక్స్‌లో స్కేటర్ రెడ్ఫోర్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే.