తెలంగాణ

ఖరీఫ్ నాటికి ప్రాజెక్టుల పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులన్నీ వచ్చే ఖరీఫ్ సీజన్‌కల్లా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి చేయని వర్కింగ్ ఏజన్సీలను రద్దు చేసి కొత్త వాటకి అప్పగిస్తామని మంత్రి హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పురోగతిపై జలసౌధలో గురువారం సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నట్టు మంత్రి తెలిపారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, ఇనుక రీచ్‌లపై సమస్యలపై చర్చిస్తానన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, ప్రాజెక్టుల నిర్మాణంలో భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు. తక్షణమే భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి చేయని వర్కింగ్ ఏజెన్సీల ఒప్పందాలను రద్దు చేసి కొత్తవాటికి ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేసారు. నత్త నడకన పనులు చేస్తున్న ఏజెన్సీలను 60 సి నిబంధనల కింద రద్దు చేయాలని మంత్రి సూచించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి మూడు నెలలుగా నీటి విడుదల కొనసాగుతుండటంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెలాఖరులో నీటి విడుదలను నిలిపేసి పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ ఎత్తిపోతల పథకంలో నాలుగు పంపులు ప్రస్తుతం పని చేస్తున్నాయని, నాలుగవ పంపును మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎత్తిపోతల 2 నుంచి 3 వరకు 1.2 కిలో మీటర్ల టనె్నల్ జూలై వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. జూలై తర్వాత ఏజెన్సీలకు గడువు పెంచే ప్రసక్తే లేదన్నారు. కాలువల కట్టల ఎత్తును 2 మీటర్ల వరకు పెంచాలన్నారు. డి-82 కాలువ తవ్వకం పనులన్నీ జూలై వరకు పూర్తి చేయాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆయకట్టు మొత్తానికి సాగునీరు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినట్టు మంత్రి వివరించారు. అచ్చంపేట నియోజక వర్గంలో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి చంద్రసాగర్ కాలువల నిర్మాణంపై ప్రతిపాదనలు పంపించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

చిత్రం..సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు