Others

అజ్ఞానంతోనే అనర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞానం వల్లనే సర్వ అనర్థాలు కలుగుతాయి. అజ్ఞానం నశిస్తే జ్ఞానం ఉదయిస్తుంది. అపుడు ఇబ్బందులేవీ ఉండవు.దేనినైనా పూర్తిగా తెలుసుకొంటే దానిగురించిన అవగాహన వస్తుంది. పూర్తిగా తెలిసినదే కనుక ఏమీ అనుమానం ఉండదు. కాని ఏ వస్తువు గురించి యైనా పూర్తిగా తెలియకుండానే తెలుసు అనే భ్రమ కలిగితే అపుడు అజ్ఞానం ఆవరిస్తుంది. చీకటిలో పొడవుగా ఉన్న దానిని చూసి దానే్న పాము అనుకొంటే అది అజ్ఞానమవుతుంది.
కేవలం పొడవుగా ఉండడమనేది మాత్రమే తెలుసుకోవడం అనేది సగం మాత్రమే తెలుసుకొన్నట్టు అయినందువల్ల అజ్ఞానమావరించి అసలు విషయాన్ని తెలియనివ్వదు. ఆ అజ్ఞానంతోనే ఎదురుగా ఉన్నదాన్ని గురించి అపోహ తో అది పాము అని ఇక దాని గురించి ఎక్కడో విన్న జ్ఞానాన్ని అంతా దానిపైనే అపాదిస్తాము. దానితో అసలు విషయమే తప్పుకనుక చెప్పేవన్నీ తప్పులే అవుతాయి. అక్కడ ఉన్నది తాడు. చెప్తున్నది పాము గురించి అది బుస కొడుతుంది. అది కాటు వేస్తుంది. ప్రాణం తీయనూ శక్తిగలది అని చెప్పుకుంటూ పోతే వినేవాడు ఇంకా అజ్ఞానంలో కూరుకుపోతాడు. వాడు తాడు ను చూసికూడా ఎదుటిమనిషి చెప్తున్నది విని చూసిన దానికి విలువనివ్వకుండా అనుభవంతో చెప్తున్నాడని విన్నదానికి విలువనిచ్చి మరిన్ని అపోహలకు అవకాశాన్ని ఇస్తాడు. ఇట్లా వీళ్లిద్దరూ అర్థజ్ఞానంతో అజ్ఞానంలో కూరుకుపోతారు. ఎప్పుడైతే జ్ఞానవంతులు అవుతారో వారు చిదానందంతో ఉంటారు.చలించని చిత్తం కలవాడుగా ధీరుడుగా ఉంటాడు. నిర్మల మనస్సు గలవాడుగా ఉంటాడు.
ఏకాగ్రతా నిరోధోవా మూఢై రభ్యస్యతే భృశమ్
ధీరాః కృత్యం నపశ్యంతి సుప్తవత్స్వపదేస్థితా
అంటే లక్ష్యం గురించి మాత్రమే ధ్యానం చేస్తూ ఏకాగ్రతను సాధిస్తారు. యేకాగ్రత గాని చిత్తమును శాసించుట గాని ఆత్మసాక్షాత్కారము గని పొందని అజ్ఞానులు విరుద్ధ భావమును కలుగకుండా శ్రద్ధతో అభ్యసిస్తారు. నేనే దేహమను విపరీత భావన లేని జ్ఞానులు సచ్చిదానంత స్వరూపులై ఉంటారు. వారెప్పుడూ చిద్రూపునకు అసంభావన, విపరీత భావన కలుగదు.వారికి స్వస్వరూపజ్ఞానమే స్ఫురిస్తుంటుంది.

-శ్రావణి