అంతర్జాతీయం

38 మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, మార్చి 20: మూడేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు హతమార్చిన 38 మంది భారతీయు కూలీల మృతదేహాలను కనుగొన్నట్టు ఇరాక్ అధికార్లు ప్రకటించారు. బదుష్ గ్రామ సమీపంలో ఈ మృతదేహాలను పాతిపెట్టారు. ఈ గ్రామం వౌసల్ పట్టణానికి వాయువ్యంగా ఉన్నది. ఈ ప్రాంతాన్ని ఇరాకీ దళాలు గత జూలైలో స్వాధీనం చేసుకున్నాయి. ఇది అత్యంత అమానవీయ హత్యాకాండ అని ఇరాకీ అధికారి నజిహా అబ్దుల్ అమిర్ అల్ షిమారి విలేకర్లతో అన్నారు. ‘‘ఈ మృతదేహాలు మాకు సన్నిహిత దేశమైన భారత పౌరులకు చెందినవి. దుష్ట శక్తులు ఇస్లాం సూత్రాలకు చెడ్డపేరు తెచ్చేందుకే ఈ విధంగా ప్రవర్తించాయి’’ అన్నారు. మృతదేహాలకోసం వెతుకుతుండగా బాదుష్ గ్రామం వద్ద పెద్ద మట్టిదిబ్బ కనిపించింది. దాన్ని తవ్వడంతో మృతదేహాలు బయల్పడ్డాయి. ఐఎస్ ఉగ్రవాదులే ఈ శవాలను పాతిపెట్టినట్టు గ్రామస్థులు తెలిపారు.కాగా బందీలైన నాలుగైదు రోజులకు తమవారినుంచి సహాయం కోరుతూ ఫోన్‌కాల్స్ వచ్చాయని మృతుల బంధువులు తెలిపారు. అప్పట్లో ఇరాక్‌లో మొత్తం పదివేల మంది భారతీయులు ఉండేవారు.