కృష్ణ

కేంద్రం దిగి వచ్చే వరకు హోదాపై ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్), మార్చి 22: ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం దిగి వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఉద్యమం ఆగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య) అన్నారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి చర్చకు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం స్థానిక బస్టాండ్ సెంటరులో ధర్నా నిర్వహించారు. తొలుత పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నేతలు బస్టాండ్‌లో ప్లేకార్డులు చేతబూని ధర్నా చేశారు. ఈ సందర్భంగా బుల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని గత ఎన్నికల్లో టీడీపీతో మద్దతుతో గద్దెనెక్కిన ప్రధాని మోదీ చిట్టచివరకు రాష్ట్రానికి మొండి చెయ్యే చూపారని విమర్శించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి ప్రత్యేక నిధులు, హోదా ఇస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజలకు భంగపాటే మిగిలిందన్నారు. హోదా సాధించే వరకు కేంద్రంపై టీడీపీ చేస్తున్న ఉద్యమం ఆగదన్నారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో తమ పార్టీ ఎంపీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాసం తీర్మానం బలపడకముందే కేంద్ర దిగి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, జిల్లా కార్యదర్శి రమాదేవి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు నారగాని ఆంజనేయ ప్రసాద్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.