అంతర్జాతీయం

ప్రపంచవ్యాప్తంగా ‘క్లైమేట్’ ర్యాలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, బంగ్లాదేశ్‌లలో వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలు

మనీలా, నవంబర్ 28: వచ్చే వారం పారిస్‌లో వాతావరణ మార్పులపై జరగబోయే ప్రపంచ దేశాల సదస్సులోకచ్చితమైన ఫలితాలు సాధించాలని డిమాండ్ చేస్తూ వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన కార్యాచరణలో భాగంగా శనివారం ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాల్లో జరిగిన వాతావరణ మార్పు ప్రదర్శనల్లో వేలాదిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జపాన్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో జరిగిన ర్యాలీలు వాతావరణ మార్పుల ప్రభావంపై వ్యక్తమవుతున్న భయాలకు, పసిఫిక్ ప్రాంత ఐలాండ్ దేశాల ఆందోళనలకు అద్దం పట్టాయి. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ర్యాలీలో మత పెద్దలు, విద్యార్థులు, హక్కుల ఉద్యమ కార్యకర్తలతో పాటుగా 3 వేల మందికి పైగా పాల్గొన్నారు. ‘ప్రొటెక్ట్ అవర్ కామన్ హోమ్’, ‘క్లైమేట్ జస్టిస్’ లాంటి నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో శుక్రవారం జరిగిన ర్యాలీలో 5 వేల మందికి పైగా పాల్గొన్నారు. న్యూజిలాండ్‌లో ఆక్లాండ్‌లో, వెల్లింగ్టన్‌లో పార్లమెంటు వద్ద జరిగిన ర్యాలీల్లో సైతం వేల సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే వాతావరణ మార్పుల ప్రభావానికి తీవ్రంగా గురవుతున్న బంగ్లాదేశ్‌లో దాదాపు 30 ప్రాంతాల్లో జరిగిన ర్యాలీల్లో వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, శని, ఆదివారాల్లో ఆసియా, ఆఫ్రికా దేశాలతో పాటుగా అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో సైతం ఇలాంటి భారీ ర్యాలీలు జరగవచ్చని భావిస్తున్నారు. (చిత్రం) ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో శనివారం నిర్వహించిన భారీ ర్యాలీ