తెలంగాణ

ఉర్దూ అధికారుల నియామకాలకు దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఉర్దూ అధికారుల నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రేడ్-1, గ్రేడ్-2 అధికారుల నియామకాల కోసం ప్రత్యేక క్యాటగిరి పోస్టులను మంజూరు చేసిందని ఆ శాఖ సంచాలకులు షానవాజ్ ఖాసిమ్ తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు శాసన సభ, శాసన మండలి, జీఏడి, సమాచార కార్యలయాల్లో పనిచేసేందుకు ఈ నియామకాలను చేపడుతున్నట్టు తెలిపారు. ఉర్దూ మాద్యమంలో విద్యానభ్యసించిన వారు లేక ఉర్దూ ఒక పాఠ్యాంశంగా కలిగి డిగ్రీ పూర్తి చేసిన వారు గ్రేడ్ -2 పోస్టులకు అర్హులని, అదేవిధంగా పీజీ పూర్తిచేసిన వారు గ్రేడ్ -1 పోస్టుకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. గ్రేడ్-1 పోస్టుకు ధరఖాస్తు చేసుకునే వారు రూ.600, గ్రేడ్-2కు ధరఖాస్తు చేసుకునే వారు రూ. 500 రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈనెల 23 వరకు ధరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించామని చెప్పారు.