రంగారెడ్డి

కేంద్ర ప్రభుత్వ పాలనతో ప్రజలకు ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌పల్లి ఏప్రిల్ 15 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా పాలన వల్ల ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్‌పల్లిలోని ఎస్‌ఎం గార్డెన్స్‌లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మోదీ పభుత్వ హయాంలో దళితులు, మైనారిటీలపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్, కేరళ రాష్ట్రాలలో మైనారిటీలపై పలు దాడులు జరిగాయని గుర్తు చేశారు. అభివృద్ధికంటే వారి ఆర్భాటాలకు, ప్రచారాలకు నిధులను ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్‌కి ప్రజలు పట్టం కడతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు వెంకట స్వామి, జడ్పీటీసీ ఎం.కళావతి విఠల్, ఎంపీపీ మాల చిన్ననర్సింలు, వైస్ ఎంపీపీ బద్ధం శశిధర్ రెడ్డి, నాయకులు కే.నారాయణ, వై.ప్రకాశ్, ఎం.విఠల్, ఎం.మాణిక్ రెడ్డి, కే. రవీందర్, లక్ష్మీకాంత్ రెడ్డి, చంగల్ గోపాల్ రెడ్డి, నాగభూషణ, ఉదయమోహన్ రెడ్డి, బీ.జనార్ధన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పాండురంగా రెడ్డి, నర్సింహా రెడ్డి, మైసయ్య, గోపాల్, సత్యనారాయణ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

కల్తీ సరుకుల విక్రయాలపై
అప్రమత్తంగా ఉండాలి

షాద్‌నగర్ టౌన్, ఏప్రిల్ 15: వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వినియోగదారుల ఫోరం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరిచేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు వినియోగదారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గౌరీశంకర్ చెప్పారు. ఆదివారం షాద్‌నగర్ పట్టణం మండల పరిషత్ కార్యాలయంలో వినియోగదారుల ఫోరం అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సుకు ముఖ్యఅతిథిగా లాసర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేవీఎస్ శర్మ మాట్లాడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించి, రకరకాల ఆకర్షణీయ ప్రకటనలు చేసి ప్రజలను నమ్మించి కల్తీ సరుకులు విక్రయించే వారిపట్ల చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు వినియోగదారుల హక్కుల ఫోరం పనిచేస్తుందని అన్నారు. కల్తీ అక్రమాలపై సమాచారం అందించాలని ప్రొఫెసర్ సూచించారు. ప్రజలు తాము ఖరీదు చేసిన వస్తువులకు తప్పనిసరిగా రశీదు పొందాలని పేర్కొన్నారు. సమావేశంలో సీఎటీసీఓ చైర్మన్ మందాడి కృష్ణారెడ్డి, శంకర్‌లాల్, తూనికలు కొలతల జిల్లా అధికారి చిట్టిబాబు, ఫోరం కన్వీనర్ దిడ్డి గోపాల్, నక్క బాల్‌రాజ్, పినపాక ప్రభాకర్, గంగిరెడ్డి, జనార్దన్, జైపాల్ రెడ్డి, బాల్‌రాజ్ గౌడ్, వీరేష్, రవీందర్‌నాథ్ పాల్గొన్నారు.

పిడుగుపడి వృద్దుడి మృతి
వికారాబాద్: పిడుగుపడి వృద్దుడు మృతిచెందిన సంఘటన వికారాబాద్ మండలంలో జరిగింది. వివరాలలోకి వెళితే మద్గుల్ చిట్టంపల్లి గ్రామానికి చెందిన ఎలుక చంద్రయ్య(60) ఆదివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లాడు. వర్షం రావడంతో పొలం పక్కనే ఉన్న రేకుల షెడ్‌లోకి వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.