Others

చైనా ఆధిపత్యానికి సీపీఎం వత్తాసు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో సీపీఎం 22వ జాతీయ మహాసభలు అట్టహాసంగా జరిగాయి. త్రిపురలో ఇటీవల సీపీఎం ప్రభుత్వం పతనమైన తర్వాత జరిగిన తొలి సమావేశాలు ఇవి. ప్రస్తుతం కేరళలో మాత్రమే అధికారం కలిగిన ఈ పార్టీ దేశంలోని అనేకానేక ప్రాంతీయ పార్టీల్లో ఒకటిగా మారిపోయింది. హైదరాబాద్‌లో సీపీఎం బహిరంగ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. కాని ఈ నెల 29న జరుపతలపెట్టిన ప్రొఫెసర్ కోదండరాం సభకు అనుమతి ఇవ్వలేదు. అయితే సభను నిర్వహించేందుకు ‘తెలంగాణ జన సమితి’ అధినేత కోదండరాం కోర్టు నుంచి అనుమతి పొందారు. దీంతో పేదల పార్టీ అయిన సీపీఎంకు, ‘దొరల పార్టీ’ అని పేరుపడ్డ తెరాసకు గల సాన్నిహిత్యాన్ని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను వ్యతిరేకించిన వారిలో సీపీఎం సిద్ధాంతకర్తలు మొదటివారు. అయినా భాజపాను ఓడించేందుకు ఇప్పుడు బెంగాల్‌లో మమతా బెనర్జీతోను, తెలంగాణలో కెసిఆర్‌తోను సీపీఎం నేతలు చేతులు కలిపేందుకు సిద్ధపడుతున్నారు.
సీపీఎం మహాసభల్లో ఆ పార్టీ అగ్రనేత ఏచూరి సీతారాం మోదీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వల్ల ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. కేరళ, త్రిపురల్లో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తృతీయ ఫ్రంట్ అవతరణను స్వాగతిస్తూనే, ‘లాల్-నీల్’ కలయిక ద్వారా హిందూ మతోన్మాదాన్ని నిరోధించాలని ఏచూరి అన్నారు. కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొమ్ముకాస్తున్నదని, త్రిపురలో తమ వైఫల్యాలకు బిజెపి మతతత్వ వాదమే కారణమని సీపీఎం నేతలు ఈ సభల్లో ధ్వజమెత్తారు.
కాగా, అమెరికా తర్వాతి స్థానాన్ని పొందాలని చైనా ప్రయత్నిస్తున్నది. ఆర్థికశక్తిగా ఎదుగుతూ సామంత దేశాలను సృష్టించుకుంటున్నది. తన సరిహద్దులను గ్రేట్ చైనావాల్ నుండి చాలావరకు విస్తరించింది. టిబెట్, నేపాల్, మానస సరోవర్, బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాలను కబళించింది. ఇప్పుడు భూటాన్, సిక్కింలపై దృష్టిపెట్టింది. డోక్లామ్‌ను హస్తగతం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం మహాసభలు చైనా ఆర్థిక, రాజకీయ విధానాలకు బహిరంగంగానే మద్దతును ప్రకటించాయి. జిన్‌పింగ్ ‘యావజ్జీవ చైనా అధ్యక్షుడు’ కావడాన్ని స్వాగతించినా సీపీఎం నేతలు- ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని భీషణ ప్రతిజ్ఞలు చేశారు. ఈ పార్టీలో ప్రకాష్ కారత్, ఏచూరి సీతారాం వర్గాలకు మధ్య అంతర్గత వైరుధ్యాలున్నాయి. భాజపాను ఓడించేందుకు లౌకిక ప్రగతిశీల వర్గాలు ఏకం కావాలని వీరు పిలుపునిచ్చారు. వీరికి పాకిస్తాన్, చైనా, జీహాదీ ఉగ్రవాదం శత్రువులు కాదు. సిరియాపై అమెరికా దాడులను వీరు తీవ్రస్థాయిలో విమర్శించినా, సిరియాలో అసద్ రసాయనిక ఆయుధాగారాన్ని నిర్మించడాన్ని విస్మరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుర్మార్గుడని ఒప్పుకుందాం. మరి- జిన్‌పింగ్ ఏ విధంగా సన్మార్గుడో వీరు చెప్పలేదు.
కేరళలో క్రైస్తవీకరణ పెద్దస్థాయిలో జరుగుతోంది, ఇక ఇస్లామీకరణ కొన్ని వందల ఏళ్లుగా జరిగింది. మల్లపురం వంటి ప్రాంతాల్లో జీహాదీ ఉగ్రవాద రిక్రూట్‌మెంటు స్థావరాలున్నాయి. ‘ఐసిస్’ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరినవారు జాఫ్నా (శ్రీలంక) మీదుగా దుబాయి చేరి అక్కడి నుండి సిరియా వెళ్తున్నారు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఉగ్రవాదుల మద్దతుతో తన అస్తిత్వాన్ని కాపాడుకుంటోంది. హిందూ దేవాలయాల నిర్వహణను నిర్లక్ష్యం చేసింది. కేరళ శాసనసభలో సీపీఎం సభ్యుడు టి.వి.రాజేశ్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ప్రకారం ఆలయ పరిసరాల్లో హిందూ సామాజిక సంస్థలు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదు. ఎవరైనా హిందూ మతవ్యాప్తికి సమావేశాలు నిర్వహిస్తే వారికి ఏడాది జైలుశిక్ష, పదివేల రూపాయల జరిమానా విధించాలి. ఈ బిల్లు ప్రధాన లక్ష్యం విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్ దళ్, హిందూవాహిని వంటి సంస్థలు కేరళలో వౌనంగా ఉండాలనడం. అయితే, చైనాప్రేరేపిత ఉగ్రవాద విద్యార్థి సంఘాలు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో జనం పాల్గొనరాదని, బాలగోకులం వంటి ఉత్సవాలను నిర్వహించరాదని కేరళ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ‘ఓనం’ పండుగ సందర్భంగా బలిచక్రవర్తికి స్వాగతం పలికేందుకు రోడ్లపై ముగ్గులు వేయరాదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాన్ని సచివాలయ ఉద్యోగులు ధిక్కరించారు. ఐతే రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు ప్రార్థనల కోసం ముందుగానే తమ కార్యాలయాల నుంచి వెళ్లిపోవచ్చు. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయన్ పాలనలో హిందూ సంస్థలపైన, హిందువులపైన దాడులు నిత్యకృత్యంగా మారాయి. హత్యారాజకీయాలు అదుపుతప్పాయి. గత ఫిబ్రవరిలో శ్రీ్ధరన్ పిళ్లై రచించిన ఒక గ్రంథాన్ని కేరళలో ఆవిష్కరించిన సందర్భంగా ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ‘హత్యలతో రాజ్యాధికారాన్ని ఆశించే సిద్ధాంతం ఉన్నంతకాలం అభివృద్ధి అసాధ్యం- సంఘర్షణ కాక ప్రజలలో సమన్వయం అవసరం’ అన్నారు.
త్రిపురలో ఓడిపోవటంతో సీపీఎం నేతలు ఇపుడు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ఈ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ‘ఎందుకిలా చేశారు?’ అని ప్రశ్నిస్తే, త్రిపురలో బిజెపి ప్రభుత్వం లెనిన్ విగ్రహాలు తొలగించింది కదా!’ అని సమాధానం చెప్పారు. సీపీఎం మహాసభల్లో ఏచూరి సీతారాం పాత విమర్శలనే భాజపాపై ఎక్కుపెట్టారు. అవి.. గోరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం మైనారిటీలను హింసిస్తోంది, ఎన్నికలకు ముందు నక్సలైట్ల ఎజెండా తమ ఎజెండా అని చెప్పిన తెరాస నాయకత్వం ఇపుడు నక్సలైట్లను హింసిస్తోంది, మోదీ పాలనలో హిందూ సంస్థల ఆధిపత్యం పెరిగింది, తెలంగాణలో మానవ హక్కులకు దిక్కులేదు. తెరాస పాలనను విమర్శిస్తూనే, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం... కేసీఆర్ ప్రతిపాదించే ‘తృతీయఫ్రంట్’కు సుముఖంగా ఉన్నట్టు చెప్పటం గమనార్హం. హైదరాబాద్‌లో అట్టహాసంగా సీపీఎం మహాసభలు జరుపుకున్నారు. మరి బీజింగ్‌లో ఎవరైనా గణేశ్ ఉత్సవాలు జరుపుకోగలరా? విహెచ్‌పి కార్యాలయం ప్రారంభిస్తామంటే అనుమతి ఇస్తారా?
సీపీఎం నేతల మధ్య సైద్ధాంతిక విభేదాలు సమసిపోలేదనడానికి ఎన్నో తార్కాణాలున్నాయి. ‘మతతత్వ భాజపాను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుందాం’ అని ఏచూరి సీతారాం చేసిన ప్రతిపాదనను ప్రకాష్ కారత్ బహిరంగంగానే వ్యతిరేకించాడు. త్రిపురలో ఓటమి వల్లనేమో సీపీఎం నేతల్లో మునుపటి ఉత్సాహం కనిపించలేదన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. ఇంతజరిగినా నేతల్లో అభిప్రాయ భేదాలు యథాతథంగానే ఉన్నాయి. తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం పార్టీ సిద్ధాంతాలను పణంగా పెట్టడానికి కారత్ అంగీకరించడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాబోయే ఎన్నికల సందర్భంగా అనుసరించవలసిన వ్యూహం గురించి కూడా నాయకులలో ఏకాభిప్రాయం లేదు. నిజానికి తెలంగాణలో కోదండరామ్ పార్టీకి సన్నిహితంగా ఉండాల్సిన సీపీఎం తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తుండడం విడ్డూరం.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668