కృష్ణ

సమర్థవంతంగా బందోబస్తు విధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బందోబస్తు విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్‌పేట పోలీసు స్టేషన్‌లో బందరు సబ్ డివిజనల్ పోలీసు అధికారుల సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. బహిరంగ సభలు, ధర్నాలు వంటి కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ఠమైన బందోబస్తు నిర్వహించాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేయాలన్నారు. సిబ్బంది శారీరక దారుఢ్యాన్ని పెంచుకునేందుకు వారంలో ఒకసారి డ్రిల్ నిర్వహించాలని సూచించారు. మేలో జిల్లాకు 257 మంది శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ రానున్నట్లు తెలిపారు. వీరి ద్వారా మరిన్ని సేవలు వినియోగించుకోవాలన్నారు. స్టేషన్ రికార్డుల విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలని ఎస్పీ త్రిపాఠి పేర్కొన్నారు. సమావేశంలో బందరు డీఎస్పీ యండి మహబూబ్ బాషా, టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వాసవి, పలు స్టేషన్ల ఎస్‌ఐలు పాల్గొన్నారు.

సౌకర్యాలకన్నా మెరుగైన సేవలు ముఖ్యం

* కలెక్టర్ లక్ష్మీకాంతం

మచిలీపట్నం, ఏప్రిల్ 24: సౌకర్యాల కంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ముఖ్యమని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెక్షన్ల వారీగా పర్యటించిన ఆయన ఆయా సెక్షన్ అధికారుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. తొలుత ఎ సెక్షన్‌లో బయోమెట్రిక్ మిషన్ ద్వారా హాజరు వేసిన ఆయన వివిధ కార్యాలయాలకు సరఫరా అవుతున్న బయోమెట్రిక్ డివైస్‌లను పరిశీలించారు. టప్పాల్స్ అన్నీ స్కాన్ చేసి ఈ-ఆఫీస్ ద్వారా పంపాలని ఆదేశించారు. అనంతరం మీకోసం అర్జీదారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఏసీ’ విశ్రాంతి గదులను జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ అంబేద్కర్, ముడ వీసీ విల్సన్ బాబు, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.