సబ్ ఫీచర్

బుద్ధత్వ భావన-1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి యొక్క సుఖ సంతోషాలు ధర్మంలోనే ఉన్నాయి. మనిషి ధర్మబద్ధుడై ఎల్లవేళలా ధర్మానికే కట్టుబడి ఉండాలి. దాన ధర్మాలూ, భక్తి విశ్వాసాలూ, ఆత్మనిగ్రహం, ఆహార పానీయాల్లో మితత్వం, పుణ్యకార్యాలు, పరోపకారం- ఇవన్నీ తరగని నిధులు. ఇవన్నీ భద్రంగా ఉండేవి. మరి ఏ దొంగా దొంగిలించలేనివి. మనిషి మరణించినపుడు, అనిత్యమైన ప్రాపంచిక సిరిసంపదలను వదిలివెళ్లిపోవలసిందే! అయితే.. చేసిన పుణ్యకార్యాలూ, సత్కర్మలూ అనే నిధులు మాత్రం అతనితో బాటు అన్ని లోకాలకూ మరి జన్మ జన్మలకూ వెంట వెళతాయి. ‘జ్ఞానాన్ని’ సముపార్జించుకుని నిర్వాణ పథంపై దృష్టి నిల్పినవాడు, పక్షపాతం లేనివాడు, పరిశుద్ధుడు, పుణ్యాత్ముడు, కళ్ళపై మాయ పొరను తొలగించుకున్నాడు. నిష్ఠగలవాడు మాత్రమే లోకంలో హాయిగా ధర్మపథాన పయనించగలడు. ఇతరులకు ఇచ్చేవాడే అత్యధికంగా లబ్ధి పొందుతాడు. కృతజ్ఞత ఏ మాత్రం లేకుండా ఇతరులనుండి ఆత్రంగా తీసుకునేవాడు అత్యధికంగా నష్టపడతాడు. కోపంతో మాట్లాడిన మాట అన్నింటికంటే పదునైంది. దురాశ అత్యంత ప్రాణాంతకమైంది. కామం అన్నిటికంటే తీక్షణమైనది. అజ్ఞానమే అత్యంత గాఢాంధకారం. ఒక దేవతా బ్రాహ్మణుడు - బుద్ధ్భగవానుడు ‘అనాథపిండకుని’ జీవనంలో కొంతకాలం ఉన్నప్పుడు, ఆకాశం నుండి ఆ దేవదూత ఒక బ్రాహ్మణుని రూపంలో దిగివచ్చి బుద్ధుని కొన్ని ప్రశ్నలు అడిగినపుడు బుద్ధుడు చెప్పిన సమాధానాలు ఇవి. చిరునవ్వుతో వినడం- నవ్వుతూ మాట్లాడడం- దయతో ఇవ్వడం- నమ్రతతో తీసుకోవడం అన్నవి ఆత్మీయమైన దివ్యలక్షణాలు. నిరంతర ధ్యాన జ్ఞానసాధన ద్వారా వీటిని మనం ఎంతగా ఆదరించగలిగితే అంతగా మనకు దివ్యత్వం వికసిస్తూ ఉంటుంది. అటువంటి దివ్యత్వాన్ని తాను పొంది అందరికీ బోధించినవాడు ‘బుద్ధుడు’. బుద్ధుడి జీవితంలో ఎన్నో అనుభవాలున్నాయి. పాఠాలున్నాయి- బోధలున్నాయి. ధర్మసత్యాచరణలు ఉన్నాయి. దృష్టాంతాలు ఉన్నాయి. మచ్చుకి బుద్ధుని దయ- కరుణకు ఒక దృష్టాంతం.
ఓ రోజు ఎక్కడినుండో ఓ మనిషి వచ్చి బుద్ధుడి మొహంమీద కాండ్రించి ఉమ్మేశాడు. బుద్ధుడి అనుంగు శిష్యుడైన ఆనందుడు ‘ఇంత చులకనా నీకు బుద్ధుడంటే’ అని ఆ వ్యక్తిపట్ల అసహ్యంగా చూసి, ఆగ్రహాన్ని మండిపోతూ బుద్ధుడివైపు తిరిగి స్వామీ! మీరు అనుజ్ఞనివ్వండి; వీడు చేసిన తుచ్ఛమైన పనేమిటో వీడికి అర్థమయేట్లు చూస్తాను అన్నాడు. బుద్ధుడు మాత్రం తన శిష్యుల మాటలను పట్టించుకోకుండా తన ముఖంమీది ఎంగిలిన తుడిచేసుకుని ఆ మనిషితో ‘‘స్వామీ! మీ పట్ల నేనెంతో కృతజ్ఞుడిని. నాకు కోపం వస్తుందో రాదో నేను తెలుసుకునే అపూర్వమైన అవకాశాన్ని మీరు కల్పించారు. నేను మీ పట్ల ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా, ఎరుకతో ఉండగలిగాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదే సందర్భంలో మా ఆనందుడికి కూడా మీ వల్ల ఒక అవకాశాన్ని మీరు సృష్టించారు. దీనివల్ల తానింకా కోపం రాగలిగే స్థితిలో తానున్నట్లు ఆనందుడు కూడా నిరూపించుకోగలిగాడు. మీకు ఈ సందర్భంగా నా ఆత్మపూర్వకమైన కృతజ్ఞతలు. మీవల్ల మేం కృతార్థులమయ్యాం! కనుక దయచేసి మీరు అప్పడప్పుడూ ఇక్కడికి వస్తూ ఉండాలి. ఎవరిమీదైనా ఉమ్మేయాలని మీకనిపించినపుడల్లా నామీద ఉమ్మేస్తూ ఉండండి అన్నారు గౌతమబుద్ధులు ఆ అపరిచిత వ్యక్తితో!
ఆ వ్యక్తి బుద్ధుని మాటలకు నిర్విణ్ణుడై అక్కడికి వెళ్లిపోయాడు. తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఆ రాత్రంతా అతడికి నిద్ర రాలేదు. బుద్ధుడి మీద తాను ఉమ్మేయడం ఎంతో అవమానించే చర్య అయినా బుద్ధుడు ఏ తొట్రుబాటు కలతా చెందకుండా ప్రశాంతంగా ఉండడం,బుద్ధుని ప్రతిక్రియ అతణ్ణి ఆలోచింపచేసింది. తన తప్పు తనకు అర్థమైంది. (మిగతా రేపు)

-మారం శివప్రసాద్, 9618306173, 8309912908