రాశిఫలం-05/21/2018

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
శుద్ధ సప్తమి రా.1.55, కలియుగం - 5120 శాలివాహన శకం - 1940, అధికజ్యేష్ఠమాసం
నక్షత్రం: 
ఆశ్రేష రా.1.09
వర్జ్యం: 
మ.2.41 నుండి 4.10 వరకు
దుర్ముహూర్తం: 
మ.12.24 నుండి 01.12 వరకు, తిరిగి మ.2.48 నుండి 3.36 వరకు
రాహు కాలం: 
ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మనస్సు చంచంలంగా వుంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగా నుండుటకు ప్రయత్నించాలి.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా వుంటుంది. స్థానచలన మేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా నుండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. బంధు మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్ర్తిలు చేసే వ్యవహారాల్లో సమస్యలెదురవుతాయి. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుండును. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్ర్తిలు బంధు, మిత్రులను కలుస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా వుంటాయి.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) మిక్కిలి ధైర్య సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి.. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు.
Date: 
Monday, May 21, 2018
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి