విశాఖపట్నం

సాంకేతికతకు ఆద్యుడు రాజీవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరిలోవ, మే 21: దేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న సాంకేతికతకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఆద్యుడని పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నగర కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముందుగా రాజీవ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మానవాళి నిత్య జీవితంలో భాగంగా మారిపోయిన సెల్‌ఫోన్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు రాజీవ్‌గాంధీ దూరదృష్టితో తీసుకువచ్చినవేనన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తేనే దేశానిక ప్రపంచ గుర్తింపు లభిస్తుందని భావించి, భారతదేశాన్ని అగ్రభాగంలో నిలిపారన్నారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం ద్వారా రాజకీయ రూపకర్తలుగా మలిచారన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర రావు మాట్లాడుతూ రాజీవ్ గాంధీకి విశాఖతో మరచిపోలేని అనుబంధం ఉందన్నారు. రాజీవ్ చివరి మజిలీ విశాఖ నగరం కావడం విశేషమన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమణికుమారి, వుడా మాజీ చైర్మన్ పీఎస్‌ఎన్ రాజు, నగర కాంగ్రెస్ కార్యదర్శి కె గోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుంటూరు నర్శింహమూర్తి, కొణతాల శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం బీచ్‌రోడ్డులో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.