తెలంగాణ

చెక్కులు రాలేదని ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మే 21: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల పెట్టుబడి కోసం ఏర్పాటుచేసిన రైతుబంధు పథకంలో లోపాలు అక్కడక్కడ పున రావృతం అవుతూనే ఉన్నాయ. జోగుళాంబ గద్వా ల జిల్లా ధరూరు మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతుబంధు పథకం కింద చెక్కులు, పాసుపుస్తకాలు అందలేదంటూ ఇద్దరు రైతులు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితులు వాయుల భీమన్న, దామోదరంల కథనం మేరకు.. చింతరేవుల గ్రామ పంచాయతీ పరిధిలోని రేవులపల్లి గ్రామానికి చెందిన హన్మంతు కుమారుడు వాయుల వెంకటయ్య, భీమన్న, సుదర్శన్‌లు ముగ్గురు అన్నదమ్ములు. వీరి తండ్రి పేరిట ఉన్న పొలంతో పాటు వీరి పేరిట ఉన్న 22 ఎకరాల భూమికి సంబంధించి సమగ్ర భూ సర్వేలో వివాదం పరిష్కరించలేదని, అదే విధంగా వెంకటయ్యకు పాసుపుస్తకాలు, చెక్కులు పంపిణీ చేశారని భీమన్న ఆరోపిస్తున్నారు.
దీంతో అధికారులు గత కొంతకాలం నుంచి పాసుపుస్తకాలు, చెక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడంతో పాటు లంచాలు అడుగుతున్నారని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు చెప్పారు. అదేవిధంగా దామోదరారికి సంబంధించి సర్వేనెం.736, 737లో 2.20 ఎకరాల వ్యవసాయ పొలం ఉండగా గత 15వ తేదీ రోజున గ్రామంలో చెక్కుల పంపిణీ జరుగగా, చెక్కు మిస్సయిందని, కార్యాలయానికి వస్తే ఇస్తామని గత వారం రోజుల నుండి రోజూ తిప్పుకుంటూ చెక్కు ఇవ్వడం లేదని ఆరోపించారు.
దీంతో వాయుల భీమన్న, దామోదరంలు ధరూరు తహశీల్దార్ ఎదుట అధికారులతో వాగ్వాదానికి దిగి పురుగుల మందు తాగేశారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయంపై తహశీల్దార్ సుబ్రమణ్యంను వివరణ కోరగా, వాయుల భీమన్నకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఉండడంతో పాసుపుస్తకాలు, చెక్కులను నిలిపివేశామనీ.. అదే విధంగా దామోదరానికి సంబంధించి పాసుపుస్తకం, చెక్కులు సిద్ధంగా ఉన్నప్పటికీ కార్యాలయానికి వచ్చి అధికారులపై దుర్భాషలాడుతూ వీఆర్‌ఓపై దాడి చేశారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పురుగుల మందు చల్లుకున్నారని వివరణ ఇచ్చారు.