కృష్ణ

కోర్టు ఉత్తర్వులు అందేవరకు ఇళ్ల నిర్మాణం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: మండల కేంద్రం మొవ్వలోని సర్వే నెం.284లోగల ప్రభుత్వ భూమిలో ముందస్తు అనుమతి లేకుండా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టటం న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరించటమే అవుతుందని చల్లపల్లి సీఐ జనార్ధనరావు స్పష్టం చేశారు. ఆ స్థలం పరిధిలోని 49 మంది లబ్ధిదారుల్లో 16 మంది అనర్హులు పోను మిగిలిన 33 కుటుంబాలలో కొంత మంది జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి శీలం ప్రకాశరావు ఆధ్వర్యంలో ప్రభుత్వం కేటాయించిన నివేశన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పిటీషనర్లు సమాచారాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వారు స్పందించి చల్లపల్లి సీఐ వి జనార్ధన్ పర్యవేక్షణలో కూచిపూడి ఎస్‌ఐ పెద్దిరెడ్డి సురేష్, మహిళా కానిస్టేబుల్స్‌తో సంఘటన స్థలానికి తరలి వచ్చి లబ్ధిదారులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించినట్లు తహశీల్దార్ రామానాయక్ తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. చల్లపల్లి సీఐ నచ్చచెప్పి న్యాయస్థానం తదుపరి ఉత్తర్వుల వరకు ఇటువంటి అనాలోచిత చర్యలు చేపట్టవద్దని లబ్ధిదారులకు చెప్పారు.

పెడనలో కాంగ్రెస్‌ను బలపర్చండి

పెడన, జూన్ 1: పెడన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నాయకులు కష్టపడాలని పీసీసీ అధ్యక్షుడు నీలకంఠం రఘువీరారెడ్డి సూచించారు. శుక్రవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో రఘువీరారెడ్డిని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కలిశారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి ఎస్‌వి రాజు ఆధ్వర్యంలో నాయకులు రఘువీరారెడ్డిని కలిసి పార్టీ పరిస్థితి గురించి వివరించారు. నాలుగు మండలాలతో పాటు పట్టణంలో కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌విరాజు తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ స్థాయి నుంచి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర కమిటీ నుంచి నాయకులకు సహాయ సహకారాలు అందిస్తామని రఘువీరా తెలిపారు. ఎస్‌వి రాజుతో పాటు పార్టీ నాయకులు సుధాకరరావు, కొల్లూరి నాగభూషణం, కట్టా నాంచారయ్య, ఆకురాతి జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు.