తెలంగాణ

విద్యుత్ చౌర్యం 43 శాతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో విద్యుత్ చౌర్యం 43 శాతం జరుగుతోందని సాక్షాత్ సంబంధిత శాఖ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పకతప్పదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారుల్లో రోజూ 2,3 గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అక్రమార్కుల చేష్టలతో నేరం వారిది ఇబ్బందులు మాకా అంటూ వినియోగదారులు ఆహ్రం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో పైనుంచి దిగువస్థాయి వరకు అధికార యంత్రాంగం హైదరాబాద్‌లో కేంద్రీకృతంగా పని చేస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. సమాచార విప్లవంతో వివిధ రంగాలు గణనీయంగా ముందుకు సాగుతుంటే విద్యుత్ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయా అన్న అనుమానాలు నిర్లిప్తం అవుతోందన్నది స్పష్టం అవుతోంది. ఆధునిక సమాచార వ్యవస్థను విద్యుత్ అధికారులు అందిపుచ్చుకోవడంలో విఫలం అవుతున్నారని బలంగా విమర్శలు ఉన్నాయి. విద్యుత్ వినియోగదారులతో విద్యుత్ బల్లులను ముక్కుపిండి వసూళ్ళు చేయడం, సమయం దాటిపోతే విద్యుత్ కనెక్సన్ తొలగించడం వంటి చర్యలకు విద్యుత్ సిబ్బంది చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. అక్రమ మార్గంలో విద్యుత్‌ను చౌర్యం చేస్తుంటే విద్యుత్ సంస్థలు ఏమి చేస్తున్నాయని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి జరుగుతోందా? లేక తెలియక జరుగుతోందా అంటూ ప్రశ్నిస్తే అందుకు సమాధానం దొరకదు. విద్యుత్ చౌర్యంతో కోట్లాది రూపాయలు విద్యుత్ సంస్థలకు దక్కకుండా పోతోంది. విద్యుత్ చౌర్యం అంతా రాత్రి సమయాల్లో జరుగుతోంది. ప్రతి యేటాగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ 11,500 కోట్ల విద్యుత్ చార్జీల వసూళ్ళుతో పెద్ద ఎత్తున టర్నోవర్ జరుగుతోంది. ముఖ్యంగా బాలాపూర్, గండిమైసమ్మ, సిఆర్‌పిఫ్, బేగంబజార్, పాత బస్తీ, ఔటర్‌రింగ్ రోడ్డు పరిసరాల దాబాల్లో విద్యుత్ చౌర్యం ఎక్కువగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. బాలాపూర్, గండిమైమ్మ, సిఆర్‌పిఎఫ్ ఏరియాల్లో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. పాత బస్తీ (చార్మినార్) ఏరియాలో వ్యాపార వర్గాలు అక్రమ కనెక్సన్‌లతో విద్యుత్ చౌర్యానికా పాల్పడుతున్నారు. పాతబస్తీలో విత్యుత్ వ్యవస్థను ఆధునీకరించడానికి ఎన్ని ప్రణాళికలను ముందుకు తీసుకువచ్చనా అందుకు స్థానికులు సహరించడంలేదని తెలుస్తోంది. పాత విద్యుత్ వ్యస్థను కొరసాగిస్తున్నందున కొంత విద్యుత్ నష్టపోక తప్పదని చెబుతున్నారు. పాతబస్తీ ఏరియాలో పురానత భవనాలు ఉన్నందున నూతన విద్యుత్ వ్యవస్థను అమలు చేయడానకి అవరోదాలు ఉన్నాయని చెబుతున్నారు. ముంబయ్ నుంచి విద్యుత్ చౌర్యంను అరికట్టడానికి తెచ్చన పరికరంతో ప్రయోగాలు చేస్తుంటే అందుకు విద్యుత్ దిగువ స్థాయి అధికారులు మోకాలొడ్డుతున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రతియేటా విద్యుత్ వినయోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సంస్థలకు భారీగా ఆదాయం వచ్చేస్తోంది. అయితే విద్యుత్ చౌర్యంతో విద్యుత్ సంస్థలు డిలాపడే పరిస్థితులు ఉన్నాయని అధికారులు గుర్తు చేస్తున్నారు.