కృష్ణ

స్వాధీన ఎగ్రిమెంట్ భూములకు ఉచిత రిజిస్ట్రేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను: 2014 సంవత్సరం పూర్వం స్వాధీన అంగీకారంతో ఎగ్రిమెంట్ చేసుకుని డబ్బులు సర్దుబాటు గాక రిజిస్ట్రేషన్ ఆగిపోయిన భూములకు ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుందని తహశీల్దార్ వివి భరత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మాట్లంలో జరిగిన రెవెన్యూ గ్రామసభలో తహశీల్దార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాధీన అగ్రిమెంట్ చేసుకున్న ఇరువర్గాలు ఒప్పుకుంటేనే ఈ విధంగా ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుందన్నారు. 2014 పూర్వం ఒప్పందం జరిగి ఆర్థికంగా ఇబ్బంది కారణంగా నిలిచిన రిజిస్ట్రేషన్‌లకే ఇది వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాలలో పొరపాటున ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేసి ఉంటే ఈ గ్రామసభలలో అధికారుల దృష్టికి తీసుకువచ్చి సరి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తమ్ములక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా -గోదావరి నీళ్లకు పూజలు

మండవల్లి, జూన్ 24: మండలంలోని అయ్యవారి రుద్రవరంలో కృష్ణా -గోదావరి నదుల నీళ్లకు ఆదివారం మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ప్రత్యేక పూజలు చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి చేరిన నీటిని అధికారులు తాగు, సాగునీటి అవసరాల కోసం విడుదల చేశారు. కైకలూరు నియెజకవర్గానికి పోలరాజ్ కాల్వ ద్వారా పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో అయ్యవారిరుద్రవరం వద్ద వెంకటరమణ, టిడిపి నాయకులు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య నీటికి హారతులిచ్చి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ గుత్తా శివరామకృష్ణప్రసాద్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, జిల్లా పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి గంగునేని వరప్రసాద్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.