క్రీడాభూమి

ఇంగ్లాండ్ షూట్.. కొలంబియా అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 4: ఇంగ్లాండ్ నమ్మకం నెగ్గింది. కొలంబియా ఆశలు ఆవిరయ్యాయి. నాకౌట్ పోరులో చివరి మ్యాచ్ షూటౌట్‌కు దారితీయడం కొలంబియాకు కలిసిరాలేదు. ఎరిక్ సాధించిన గోల్‌తో ఇంగ్లాండ్ క్వార్టర్స్‌కు చేరిపోయింది. తుది ఎనిమిది జట్ల పోరులో ఇంగ్లాండ్ స్వీడన్‌తో తలపడనుంది. ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ చివరి మ్యాచ్‌గా మంగళవారం రాత్రి స్పార్టక్ స్టేడియంలో ఇగ్లాండ్ -కొలంబియాలు తలపడ్డాయి. విజయమో, వీరమరణమో తేల్చుకునే దిశగా రెండు జట్లూ హోరాహోరీ పోరుకు తెరలేపాయి. ఒకరిపై ఒకరు పట్టుసాధించేందుకు చేసిన ప్రయత్నాల్లో రెండు జట్లూ గోల్స్ సాధించలేకపోయాయి. కార్లోస్ శాంచెజ్ కార్నర్ పాస్‌తో అందివచ్చిన పెనాల్టీ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకున్న హ్యారీకేన్ గోల్ సాధించడంతో 57వ నిమిషంలో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యానికి చేరింది. టోర్నీలో ఆరు గోల్స్ సాధించిన ఆటగాడిగా గోల్డెన్ బూట్ లైన్‌లో నిలబడ్డాడు హ్యారీ కేన్. ఆ తరువాత రెండు జట్లూ ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. ఇక ఇంగ్లాండ్ తుది ఎనిమిది జట్ల జాబితాలో చేరిపోయినట్టేనని అంతా అనుకున్నారు. అయితే, ఇంజ్యురీ (90+3) టైంలో కొలంబియా ఆటగాడు యెర్రీ మినా గోల్ సాధించడంతో ఇంగ్లాండ్ నీరుగారిపోయింది. మరో 30 నిమిషాల పాటు సాగిన ఆటలో ఏ జట్టూ గోల్ సాధించలేకపోయాయి. చివరకు మ్యాచ్ ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించారు. కొలంబియా స్ట్రయికర్ రాడమెల్ ఫాల్కో గోల్ సాధించడంతో, ఇంగ్లాండ్ స్ట్రయికర్ హ్యారీ కనె గోల్ సాధించి స్కోరు సమం చేశాడు. జాన్ కౌడ్రడో సాధించిన గోల్‌తో కొలంబియా 2-1కి చేరితో, ఇంగ్లాండ్ స్ట్రయికర్ మార్కర్ రష్‌ఫోల్డ్ గోల్ సాధించి మళ్లీ స్కోరును సమం చేశాడు. కొలంబియా ఆటగాడు లూయిస్ మురియల్ గోల్‌తో 3-2కు చేరితో, ఇంగ్లాండ్ మిడ్‌ఫీల్డర్ జోర్డాన్ హాన్డర్సన్ షూటౌట్ మిస్సవడంతో 3-2 ఆధిక్యంతో కొంలబియా నిలిచింది. కొలంబియా ఆటగాడు మేటియస్ ఉరిబె షూటౌట్ తప్పడం, ఇంగ్లాండ్ మిడ్‌ఫీల్డర్ కైరన్ ట్రిస్పియర్ గోల్ సాధించడంతో మళ్లీ స్కోరు 4-4తో సమమైంది. కొలంబియా ఆటగాడు కార్మోస్ బక్కా షూటౌట్ మిస్సవడం, ఇంగ్లాండ్ ఆటగాడు ఎరిక్ డయర్ సమర్థంగా గోల్ చేయడంతో 5-4తో ఇంగ్లాండ్ విజయం సాధించింది.