క్రీడాభూమి

52 ఏళ్ల కల...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెపినో, జూలై 6: యువ ఆటగాళ్ల ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న ఇంగ్లాండ్ జట్టు. వెన్నుతట్టే అదృష్టాన్ని పిక్కల్లో నింపుకుని పరుగులు తీస్తున్న స్వీడన్ జట్టు. సెమీ ఫైనల్స్‌లో బెర్త్ కోసం శనివారం ‘సమరాం’గణంలో తలపడబోతున్నాయి. ప్రపంచ కప్ సాధించాలన్న 52 ఏళ్ల కల సాకారానికి ఈ మ్యాచ్ పునాధికానుందని ఇంగ్లాండ్ అభిమానులూ ఆశపడుతున్నారు. కల సాకారమయ్యే సమయంలో ప్రత్యర్థి చేతిలో దెబ్బతినడం ఇంగ్లాండ్‌కు గత ఎనిమిది ప్రపంచ కప్‌ల్లో ఆనవాయితీగా మారింది. మాస్కోలో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌తో ప్రత్యర్థి కొలంబియాను ఇంటికి పంపి క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టిన ఇంగ్లాండ్, ఈసారి వెనుతిరిగి చూసేది లేదన్న నమ్మకాన్ని మాత్రం వ్యక్తం చేస్తోంది. ‘ప్రపంచ కప్‌ను ముద్దాడి చాలా కాలమైంది. మరోసారి విజయానికి తహతహలాడుతున్నాం. ఇంగ్లాండ్ గర్వించే విజయంతోనే ఇంటికెళ్తాం’ అంటున్నాడు డిఫెండర్ జాన్ స్టోన్స్.
స్వీడన్ తక్కువేం కాదు
సంభావ్యతా శాతాల్లో కేవలం 23 శాతమే విజయావకాశాలతో బరిలోకి దిగుతున్న స్వీడన్, అద్భుతాలను ప్రదర్శించలేదన్న అపనమ్మకాలైతే ఏమీ లేవు. గ్రూపుదశ మ్యాచులు, ప్రీ క్వార్టర్స్‌లో సత్తాను చాటుకున్న స్వీడన్, కాలం కలసొస్తే టాప్ ఫోర్‌కు చేరుకోగలమన్న ధీమాతో బరిలోకి దిగుతోంది. ‘ఇంగ్లాండ్ జట్టు బలంగా ఉన్నమాట నిజమే. అలాగని మేం తక్కువని అనుకోవడం లేదు. బంతిని సాధ్యమైనంత వరకూ మా నియంత్రణలో ఉంచుకోవాలన్న వ్యూహంతో బరిలోకి దిగుతున్నాం’ అంటున్నాడు స్వీడన్ కెప్టెన్ ఆండ్రియన్ గ్రాన్‌క్విస్ట్.