కృష్ణ

హడావుడిగా వరికుప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, నవంబర్ 29: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వాతవరణం దోబూచులాడుతుండటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆదివారం రాత్రి నుంచి దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయటంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీంతో ఏమిచేయాలో తెలియక కోసిన పంట ఆరకుండానే కూలీలను తీసుకొచ్చి కట్టలు కట్టించి హడావుడిగా కుప్పలు వేయిస్తున్నారు. వాన ఎప్పుడు ముంచుకొస్తుందోననే ఆందోళనతో కూలీలకు ఎక్కువ డబ్బులు చెల్లించిమరీ కుప్పలు వేయిస్తున్నారు. ముమ్మరంగా వరికోతలు కోయిస్తున్న రైతులు వాతావరణ ప్రభావంతో మధ్యలోనే ఆపేశారు. ఈ సంవత్సరం వరిపంట బాగా పండిందని, ఇటీవల కురిసిన వర్షానికి కొంత దెబ్బతిన్నా మిగతా పంట అయినా చేతికి అందుతుందనుకుంటున్న తరుణంలో వాయుగుండం ప్రభావంతో మళ్లీ ఎక్కడ ముప్పు ముంచుకొస్తుందోనని రైతులు భయపడుతున్నారు. మండలంలో ఎక్కువ శాతం వరిచేలు కోతలు కోసి ఉన్నాయి. కొన్ని వరిచేలు ఇటీవల కురిసిన వర్షానికి నేలావాలి అలాగే ఉన్నాయి. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో కోతలు కోద్దామన్న తరుణంలో వాతావరణ మార్పుతో రైతులు సందేహంలో పడ్డారు. వ్యయప్రయాసలకోర్చి పండించిన పంట నోటికాడికి వచ్చే సమయానికి వర్షాల వల్ల నష్టపోవాల్సి వస్తుందని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.