క్రీడాభూమి

ఆచితూచి ఆడకతప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: ఇండోనేషియాలోని జకార్తాలో జరిగే ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా దిగుతున్న భారత హాకీ జట్టు ఆచి తూచి ఆడాల్సిన అవసరమెంతైనా ఉందని పురుషుల జట్టు కోచ్ హరేంద్ర సింగ్ అన్నాడు. ఆగస్టులో ప్రారంభమయ్యే ఆసియా క్రీడల్లో భారత్ తలపడే జట్లను తాము తక్కువగా అంచనా వేయబోమన్నాడు. కొన్ని జట్లు తమకు గట్టి పోటీ ఇస్తాయని బలంగా నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే, ఆ దిశగా జట్టు మొత్తం పోరాడుతుందని హామీ ఇచ్చాడు. ప్రపంచ హాకీ ర్యాంకింగ్‌లో ప్రస్తుతం 6వ ర్యాంక్‌లోవున్న భారత్, ఆసియా క్రీడల్లో పూల్-ఏలో కొరియా, జపాన్, శ్రీలంక, హాంకాంగ్ చైనాతో తలపడుతుంది. గ్రూప్-బీలో మలేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఓమన్, థాయ్‌లాండ్‌తోపాటు ఆతిధ్య ఇండోనేషియా జట్లు తలపడతాయి. భారత్ తన ప్రారంభ మ్యాచ్ ఆగస్టు 22న హాంకాంగ్ చైనాతో పోటీపడుతుంది. తర్వాత 24న జపాన్, 26న కొరియా, 28న శ్రీలంకతో ఆడుతుంది. ముఖ్యంగా భారత్ ఇంతవరకు ఎన్నడూ తలపడని జట్లు హాంకాంగ్ చైనా, శ్రీలంకతో ఆడేటపుడు మరింత జాగురూకతతో వ్యవహరిస్తామని కోచ్ అన్నాడు. ఇక జపాన్ విషయానికొస్తే ఈ టీమ్ ఇటీవల ఆడిన కొన్ని ఈవెంట్లలో అద్భుత ప్రదర్శన కనబర్చిందని, అదేవిధంగా కొరియా కూడా బలమైన జట్టుగా ఎదుగుతోందని, ఈ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు. 2014 ఆసియా గేమ్స్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన భారత్ గోల్డ్ మెడల్ అందుకోవడం ద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బెర్త్‌ను ఖాయం చేసుకున్న విషయాన్ని హరేంద్ర సింగ్ గుర్తు చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో సైతం గోల్డ్ మెడల్ సాధించేందుకు భారత్ తహతహలాడుతోందన్నాడు. కాగా, భారత మహిళల హాకీ టీమ్ చీఫ్ కోచ్ జియోర్డ్ మరిజ్నే మాట్లాడుతూ ఆసియా గేమ్స్‌లో తమ జట్టు గోల్డ్ మెడల్ సాధించే దిశగా పోరాడుతుందని, కొరియాకు గట్టి పోటీ ఇస్తామనే నమ్మకం ఉందని పేర్కొంది. ఈ ఏడాది కొరియాతో జరిగిన కొన్ని మ్యాచ్‌లలో ప్రత్యర్థి ఆటతీరును ఆసాంతం గమనించామని, అందుకు తగ్గట్టుగా తమ ఆటతీరును ప్రదర్శిస్తామనే విశ్వాసం ఉందని తెలిపింది. 2014 ఆసియా గేమ్స్‌లో భారత మహిళల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
మెరుగుపడిన భారత్ ర్యాంక్
అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 5వ స్థానం దక్కించుకుంది. ఇటీవల నెదర్లాండ్స్‌తో బ్రెడాలో జరిగిన చాంపియన్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలవటంతో భారత్ 5వ స్థానానికి చేరింది. చాంపియన్ ట్రోఫీలో విన్నర్‌గా నిలిచిన ఆస్ట్రేలియా (1906 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. అర్జెంటీనా (1883), బెల్జియం (1709), నెదర్లాండ్స్ (1654), భారత్ (1484), జర్మనీ (1456) పాయింట్లతో వరుస స్థానాల్లో నిలిచాయి.