కృష్ణ

‘వరస’లతో ఓట్లు రాలవ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: ప్రతి ఒక్కరికీ మేలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం ఆయన మండలంలోని చంద్రాలలో గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘వరసలు కలపడం వల్ల ఓట్లు’ రాలవని అన్నారు. ఈసందర్భంగా సెంటర్‌లో గురువారం జరిగిన సభలో మాట్లాడుతూ 2006లో ఖరీదు కలిగిన పరిటాల పంట పొలాలను కాజేయాలని కుట్రలు చేసిన వారు, కంచికచర్ల నక్షత్ర థియేటర్‌లో రైతులకు నక్షత్రాలు చూపించిన వారు నేడు కొత్తకొత్త వేషాలతో మైలవరం వచ్చి అర్థరాత్రి తలుపులు తడుతూ అక్కా, బావా అంటూ వరసలు కలుపుకుంటున్నారని వైసీపీ నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ళపాటు తనను తిట్టిన నాయకుడు కనిపించటం లేదని, కొత్తగా వచ్చిన వారు ఎలా తిట్టాలో అర్థం కాక తికమక పడుతున్నారని అన్నారు. గత కాంగ్రెస్ పాలకులు పేపర్లపై పేదలకు ఇళ్ళు నిర్మించి నాలుగు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ బొక్కిన వాళ్ళంతా ఇప్పుడు వైసీపీలోకి వచ్చి తమను తిడుతున్నారన్నారు. తాను గ్రామాలలో ఆరు నుండి 10 గంటల పాటు పర్యటిస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో తన శాఖ ద్వారా ఇప్పటికి 54వేల కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. పోలవరం ఆధునిక దేవాలయం అని ఇప్పటి వరకూ 50వేల మంది సందర్శించి వచ్చారన్నారు. పట్టిసీమ విలువ జగన్‌మోహనరెడ్డికి ఏం తెలుసని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మేలు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అందుకే గ్రామదర్శిని కార్యక్రమాన్ని అమలు చేస్తూ దీని ద్వారా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్లు వెల్లడించారు. సభలో పరిటాలకు చెందిన రైతు మాగంటి పుల్లారావు అనే రైతు మాట్లాడుతూ ఆనాడు భూములకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మంత్రి ఉమ ఆపకపోయి ఉన్నట్లైతే తనకు ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిని తాను కోల్పోయేవాడినని, ఇందుకు ఉమ ఏడాది పాటు పోరాటం చేసి 10 లక్షల రూపాయల సొంత ఖర్చుతో ఉద్యమాలు నడిపి తమ భూములనుకాపాడినట్లు తెలిపారు. ఈ భూముల నోటిఫికేషన్ రద్దు చేయించటం వల్ల రైతులకు కోట్ల రూపాయల ఆదా జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాయల లీలాప్రసాద్, సర్పంచ్ కొండూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇంకెన్నాళ్లు ‘పోర్టు’ కబుర్లు?

* రోజుకో ప్రకటనతో గందరగోళం * ప్రభుత్వ మాజీ విప్ పేర్ని నాని

మచిలీపట్నం, జూలై 19: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పోర్టు నిర్మిస్తామని చెప్పిన పాలకులు ఇంకెన్నాళ్లు పోర్టు పేరుతో బందరు ప్రజలను మోసం చేస్తారని ప్రభుత్వ మాజీ విప్, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశ్నించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పోర్టు పేరుతో ప్రభుత్వం అవలంభిస్తున్న చర్యలను తీవ్రంగా విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర అసమర్ధత వల్లే పోర్టు నిర్మాణం జరగడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగన్నర సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారన్నారు. ఒక్కసారిగా వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి రైతులను మూడేళ్లుగా రైతులను అష్ఠదిగ్బంధనం చేసి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. భూముల రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధించటంతో ఆర్థిక అవసరాలకు అమ్ముకోలేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా వారి వెతలు స్థానిక నాయకులకు కనిపించడం లేదని విమర్శించారు. పోర్టు పేరుతో రోజుకొక ప్రకటన చేస్తూ రైతుల్ని, ప్రజలను మోసం చేస్తున్నారే తప్ప పోర్టు నిర్మించాలన్న చిత్తశుద్ధి ఏ మాత్రం పాలకుల్లో లేదన్నారు. మాస్టర్ ప్లాన్ అంటూ ఒకసారి జపాన్ వాళ్లను, మరోసారి సింగపూర్ వాళ్లను బందరు తీసుకు వచ్చి హడావిడి చేశారే తప్ప ఇప్పటికీ మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయలేకపోయారని విమర్శించారు. బందరులో ఉన్న ఒక్కగాను ఒక్క బెల్ కంపెనీని కాపాడ లేని వాళ్లు కొత్త పరిశ్రమలు తీసుకు వస్తామని చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోర్టు భూములపై హైకోర్టు స్టే వచ్చినా బహిర్గతం చేయకుండా రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలార్ దాదా, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా, ఉప ప్రతిపక్ష నాయకుడు శీలం బాబ్జి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.