కృష్ణ

‘వారాలబ్బాయి’కి ఓట్లు కల్ల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: వలస నాయకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారు డబ్బు సంచులతో నియోజకవర్గానికి తరలివచ్చారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. డబ్బుంటే ఏదైనా సాధించవచ్చన్న వారి ఆలోచనలకు ప్రజలే అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు. ఓట్లు రాలాలంటే ప్రజాభిమానం కావాలని, అది వారికి సేవ చేయడం ద్వారానే లభిస్తుందని చెప్పారు. అంతేగాని డబ్బు సంచులతో ఎమ్మెల్యే అయిపోదామంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కుదరదని ఆయన హితవు పలికారు. ‘వారాల అబ్బాయి’లా ఇక్కడో నాలుగు రోజులు గడిపేసి, మిగిలిన రోజులు హైదరాబాద్ వెళ్లిపోయి వ్యాపారాలు చూసుకునే వారికి ప్రజాభిమానం ఎలా ఉంటుందని అన్నారు. వాళ్ల నాయకుడు కూడా వారంలో ఓ ఐదు రోజులు ‘వాకింగ్’ చేసి మిగిలిన రెండు రోజులు హైదరాబాద్‌కు పరిగెత్తుకుపోయి జైలు మెట్లు ఎక్కాలని మంత్రి ఉమ చెప్పారు. అసలు వారికి ప్రజాభిమానం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ‘ప్రజాసేవ ముసుగు’లో పదవుల కోసం వెంపర్లాడే వారికి ఎలా గుణపాఠం చెప్పాలో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. కనీసం మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇల్లు కూడా లేని కేపీ ఇక్కడి వారికి ఏం సేవ చేస్తారని, ఇది ప్రజలకు బాగా తెలుసని అన్నారు. పొరపాటున ఆ మహానుభావుడు గెలిచినా ప్రజలకు అందుబాటులో ఉండడన్నది తేటతెల్లమవుతోందని చెప్పారు. ఆయనను కలవాలంటే అప్పుడే కాదు ఇప్పుడూ హైదరాబాద్ పోవాల్సిందేనని, ప్రజలకు ఈ విషయం బాగా తెలుసని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రతిష్ఠకు గీటురాయిగా నిలిచే ‘పోలవరం ప్రాజెక్టు’పై కూడా విమర్శలు గుప్పిస్తుండడం ఆ ‘ముఠా పార్టీ’కి అలవాటుగా మారిందని మంత్రి ఉమ అన్నారు. ఇటువంటి నాయకులను ముందెన్నడూ చూడలేదని, ప్రగతి అడ్డం పడడం... పదవే ధ్యేయంగా విమర్శలు చేస్తుండడం వారి ‘గుంట నక్క’ తంతును గుర్తు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా ప్రజాభిమానం పొందాలని, డబ్బు మూటలతో అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా తీరని అన్యాయం చేస్తున్న బీజేపీని ఆ పార్టీ అధినాయకుడు పల్లెత్తుమాట అనడం లేదని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్న తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తుండడాన్ని బట్టే వారు కేసుల నుండి బయటపడడానికి మోదీ ముందు ‘మోకరిల్లినట్టు’ అర్థం అవుతోందని మంత్రి ఉమ అన్నారు. ‘కేసుల నుండి విముక్తి’కి రాష్ట్భ్రావృద్ధికి అడ్డం పడొద్దని ఆయన హితవు పలికారు.