ఈ వారం తార

బ్యాడ్‌లక్కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటే అవుననే సమాధానం వస్తుంది.. ఎందుకంటే అదృష్టం బాగా లేకుంటే.. అరటిపండు తిన్నా పన్ను విరిగినట్టు అయింది ఈ అమ్మడి పరిస్థితి? లేకపోతే.. వరుసగా రెండు సూపర్‌హిట్ సినిమాల్లో అవకాశాలను వదిలేసుకోవడం అటే నిజంగా బ్యాడ్‌లక్ కాకపోతే మరేమిటి? ప్రస్తుతం లావణ్య త్రిపాఠి పరిస్థితి ఏమీ బాగాలేదు.. చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయాలు అందుకుంటున్నాయి. పోనీ కొత్తగా వస్తున్న అవకాశాలకు ఓకె చెబుతుందా అంటే లేదు.. దాంతో మంచి హిట్ సినిమాలు చేతులారా వదిలేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో దుమ్ము రేపుతున్న గీతగోవిందం సినిమాలో ముందు రష్మిక పాత్రలో లావణ్యనే అనుకున్నారట. దానికోసం ఫొటో షూట్ కూడా చేశారట.. కానీ అప్పటికే ఓ తమిళ సినిమా ఒప్పుకోవడంతో ఈ సినిమాకు నో చెప్పింది.. దాంతో వెంటనే రష్మికని రంగంలోకి దింపేశారు. ఛలో సినిమాతో మంచి హిట్ అందుకున్న రష్మిక ఈ సినిమాతో టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. దాంతోపాటు వరుణ్‌తేజ్ నటించిన తొలిప్రేమ సినిమాలో కూడా రాశీఖన్నా కన్నా ముందు లావణ్యనే ఎంపిక చేశారట. కానీ ఆ సినిమా చేయనని తప్పుకుంది. అది సూపర్‌హిట్. ఇలా రెండు సూపర్‌హిట్ సినిమాలు మిస్ చేసుకోవడం లావణ్యకు బ్యాడ్‌లక్కే!