క్రీడాభూమి

ముగ్గురూ ముగ్గురే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 26: ఆసియా వేదికలపై చెలరేగిన అథ్లెట్లు పతకాల వేటలో భారత్ వేగం తగ్గలేదని నిరూపించారు. స్ప్రింట్ ట్రాక్‌లపై సత్తాచాటుకుని మూడు రజతాలను భారత్ ఖాతాలో వేశారు. స్టార్ స్ప్రింటర్ ధుతి చంద్ 100 మీటర్ల పరుగులో అత్యుత్తమ ప్రదర్శనతో 20ఏళ్ల భారత కలను సాకారం చేసింది. కేవలం 2 మిల్లీ సెకండ్ల దూరంలో స్వర్ణాన్ని చేజార్చుకున్న ధుతి, 11.32 సెకండ్లలో రేస్‌ని పూర్తిచేసి రజతాన్ని సాధించింది. ధుతి పేరిటవున్న జాతీయ రికార్డు 11.29 సెకండ్లే కావడం గమనార్హం. బహ్రెయిన్ అథ్లెట్ ఓడియాంగ్ ఎడిడివోంగ్ (11.30) స్వర్ణాన్ని, చైనా అథ్లెట్ వీ యోంగ్లి (11.33) కాంస్యాన్ని కైవసం చేసుకున్నారు. 400 మీటర్ల ఫైనల్స్‌లో పరుగుల రాణి హిమదాస్, స్ప్రింట్‌వీరుడు మహమ్మద్ అనాస్‌లు ద్వితీయ స్థానాలు సాధించి రజత పతకాలు సాధించారు. ప్రీ రేస్ రికార్డుల ప్రకారం ఇద్దరూ స్వర్ణాలు సాధిస్తారన్న అంచనాలున్నా, ఫైనల్ రేసులో రజతానికే పరిమితమయ్యారు. మహిళల 400 మీటర్ల రేసులో రెండు రోజుల్లో రెండోసారి జాతీయ రికార్డు సృష్టించిన హిమదాస్, 50.59 సెకండ్లలో రేస్ పూర్తి చేసి వెండి పతకాన్ని సాధించింది. 50.09 సెకండ్లలో పరుగు పూర్తి చేసి ఆసియా గేమ్స్ రికార్డు సృష్టించిన బహ్రెయిన్ అథ్లెట్ సల్వా నాసెర్ స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. 2006 దోహా ఎడిషన్‌లో మన్‌జీత్ కౌర్ రజతం సాధించిన తరువాత, 400 మీటర్ల పరుగులో భారత్ మళ్లీ పతకం సాధించడం ఇదే. పురుషుల 400 మీటర్ల ఫైనల్స్‌లో మహమ్మద్ అనాస్ 45.09 సెకండ్లలో రేస్ పూర్తి చేసి రజతాన్ని సాధిస్తే, ఖతార్ అథ్లెట్ హసన్ అబ్దలెలా 44.89 సెకండ్లలో పూర్తిచేసి స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. ఇదిలావుంటే, 100 మీటర్ల పరుగు మహిళల విభాగంలో భారత అథ్లెట్ ధుతీ చంద్ 11.43 సెకండ్లలో రేస్ పూర్తి చేసి సెమీఫైనల్స్‌కు చేరింది. ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత అను రాఘవన్ మహిళల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో తుది రౌండ్ పూర్తి చేసి ఫైనల్‌కు అర్హత సంపాదించింది. మరో భారత అథ్లెట్ జునా ముర్ము సైతం 400 మీటర్ల హర్డిల్స్‌లో ఫైనల్స్‌కు చేరడం గమనార్హం.
బ్రిడ్జిలో రెండు కాంస్యాలు
ఆసియా బ్రిడ్జి గేమ్ పురుషుల, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో భారత ఆటగాళ్లు రెండు కాంస్య పతకాలు సాధించారు. ఆదివారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఫురుషుల (జగ్గీ శివదాసాని, రాజేశ్వర్ తివారి, అజయ్ ఖరే, రాజు తొలని, దేబబ్రత మజుందార్, సుమిత్ ముఖర్జీ) జట్టు సింగపూర్ జట్టుపైన, మిక్స్‌డ్ డబుల్స్ (కిరణ్ నాడర్, హేమ దోర, హిమాని ఖండేల్‌వాల్, బాచిరాజు సత్యనారాయణ, గోపినాథ్ మన్నా, రాజీవ్ ఖండేవాల్) జట్టు థాయిలాండ్ జట్టుపైన ఓటమి చవిచూడటంతో, కాంస్య పతకాలకే పరిమితమయ్యారు.
కాంపౌండ్ ఆర్చరీలోనూ..
భారత ఆర్చరీ జట్లు మరో రెండు రజతాలను ఖాయం చేశాయి. 18వ ఆసియా గేమ్స్‌లో ఆదివారం జరిగిన పురుషుల, మహిళల కాంపౌండ్ ఈవెంట్‌లో సమష్టి ప్రదర్శనతో సెమీఫైనల్స్‌లో విజయం సాధించాయి. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల (అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రాజత్ చౌహన్) జట్టు చైనీస్ తైపీ జట్టును 230-227 స్కోరుతో ఓడించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. 2014 ఇన్చియాన్ ఆసియా గేమ్స్‌లో టైటిల్ కోసం తలపడిన సౌత్ కొరియా జట్టుతోనే ఈసారీ భారత ఆర్చర్ల బృందం ఫైనల్ పోరు సలపనుంది. ఇక మహిళా ఆర్చరీ జట్టు సైతం ప్రత్యర్థి చైనీస్ తైపీని 225-222 పాయింట్లతో మట్టికరిపించి ఫైనల్‌కు బెర్త్ ఖరారు చేసుకుంది. సురేఖా జ్యోతి వెన్నం, ముస్కాన్ కిరార్, మధుమిత కుమార్‌లు తొలి రెండు సెట్లలో 55-58, 55-57తో వెనుకబడినా, తరువాతి సెట్లలో అనూహ్యంగా పుంజుకుని 57-55, 58-52 స్కోరుతో చైనీస్ తైపీ జట్టుపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో 229-224 స్కోరుతో ఇండోనేసియాను ఓడించి భారత జట్టు సెమీస్‌కు చేరడం తెలిసిందే. వ్యక్తిగత ఈవెంట్‌లో ఒక్క పతకం సైతం సాధించలేకపోయినా, టీం ఈవెంట్‌లో భారత ఆర్చర్లు రెండు రజతాలను కైవసం చేసుకోవడం ఆనందకరం.

చిత్రాలు..హిమదాస్ *ధుతి చంద్ *మహమ్మద్ అనాస్