క్రీడాభూమి

పసిడి ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా/ పాలెంబాగ్, ఆగస్టు 26: ఆసియా బాడ్మింటన్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి పసిడి అందించేందుకు స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఉవ్విళ్లూరుతున్నారు. ఆదివారం హోరాహోరీ సాగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో ప్రత్యర్థులను మట్టికరిపించి ఇద్దరు స్టార్ షట్లర్లు సెమీస్‌కు దూసుకెళ్లారు. దీంతో ఇద్దరిలో ఎవరో ఒకరు భారత్‌కు స్వర్ణం సాధించడం ఖాయమన్న నమ్మకాలు బలపడుతున్నాయి.
ఆసియా బాడ్మింటన్ చరిత్రలో ఆరు స్వర్ణాలు సాధించిన భారత్‌కు, ఐదు టీం ఈవెంట్లు, ఒకటి పురుషుల డబుల్స్‌లోనే సాధ్యమైంది. ఇదిలావుంటే, సింధు, సైనాలకూ వ్యక్తిగత స్వర్ణం కలగానే మిగులుతోంది. ఈనేపథ్యంలో ఈసారి పసిడిని మిస్ చేసుకోకూడదన్న కసి ఇద్దరిలో కనిపిస్తోంది. ఆదివారంనాటి క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ 5వ ర్యాంకర్ రాట్చనాన్ ఇంటనాన్‌తో తలపడిన సైనా నెహ్వాల్ 21-18, 21-16 సెట్లతో విజయం సాధించి సెమీస్‌కు చేరితే, మరో మ్యాచ్‌లో 12వ ర్యాంకర్ నిట్చవోన్ జిందాపోల్‌తో తలపడిన పీవీ సింధు 21-11, 16-21, 21-14 సెట్ల విజయంతో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. సెమీఫైనల్స్‌లో సైనా నెహ్వాల్ వరల్డ్ టాప్ సీడ్, చైనీస్ తైపీ షట్లర్ తాయ్ ట్జు యింగ్‌తో తలపడనుంది. మరో మ్యాచ్‌లో పీవీ సింధు చైనా షట్లర్ చెన్ యుఫీ లేదా జపాన్ షట్లర్, వరల్డ్ నెం 2 అకానె యమగుచిని ఎదుర్కోనుంది. ‘ఇవి అద్భుత క్షణాలు. తాజా విజయంతో నా బాధ్యత పూరె్తైనట్టు కాదు. మెడల్స్ మాటెలావున్నా సరిగ్గా ఆడాల్సిన సమయం ఇంకా ముందుంది. ఆ ఆటతో స్వర్ణమే అందుతుందని అనుకుంటున్నా’ అని మ్యాచ్ అనంతరం పీవీ సింధు వ్యాఖ్యానించింది. ‘వ్యక్తిగత స్వర్ణం చివరకి ఎవరికి దక్కుతుందన్నది ఎవ్వరం చెప్పలేం. నిజానికి భారత్‌కు పసిడి పతకం సాధనపై చర్చించుకున్నాంగానీ, ఎవరన్నది ఎవ్వరికీ తెలీదు. ఫోన్‌కు దూరంగా ఉండు చాలని కోచ్ గోపీచంద్ చెప్పారు. రాట్చనాన్ అద్భుతమైన ర్యాలీ ప్లేయర్. ఆమెను ఎదుర్కోడానికి ఆరంభంలో కొంచెం ఇబ్బందిపడినా తరువాత తేరుకున్నా. ఈరోజు ఆమె మరింత బాగా ఆడింది’ అని మ్యాచ్ అనంతరం సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది.