అంతర్జాతీయం

సభలో ఖలీస్తానీ యువకుల గలాభా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలో గలాభా సృష్టించేందుకు ముగ్గురు ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. స్కాట్‌లాండ్ పోలీసులు రంగ ప్రవేశం చేసి నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన లండన్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సదస్సులో జరిగింది. సభ జరుగుతుండగా ముగ్గురు యువకులు ప్రవేశించి ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అక్కడ ఉన్న ప్రజలు స్పందించి కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొత్త సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వం, సమకృతాభివృద్ధి, స్వేచ్చ తమ లక్ష్యాలని చెప్పారు. 2019 ఎన్నికలు భారత్ దిశ, దశను మార్చుతాయన్నారు.