క్రీడాభూమి

అదిగదిగో స్వర్ణ తిలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా: ఆసియా గేమ్స్‌లో భారత్ చరిత్ర సృష్టించనుందా? స్టార్ షట్లర్ పీవీ సింధు కసిని చూస్తుంటే, ఆ మాట నిజం కావొచ్చన్న నమ్మకాలూ బలపడుతున్నాయి. సోమవారం జరిగిన సెమీఫైనల్స్‌లో కోర్టులో చిరుతలా కదిలిన సింధు, ప్రత్యర్థిని ముప్పుతిప్పలుపెట్టి మ్యాచ్‌ను కైవసం చేసుకున్న తీరు పసిడి సంకేతాన్ని బలోపేతం చేసేదే. సెమీస్‌కు దూసుకొచ్చిన మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రత్యర్థిని అధిగమించలేకపోవడంతో కాంస్యంతో సరిపెట్టుకుంది. సోమవారం జరిగిన రెండు సెమీ ఫైనల్స్ తొలి మ్యాచ్‌లో వరల్డ్ టాప్ సీడ్ తై జు యింగ్‌ను ఎదుర్కొన్న సైనా, ప్రత్యర్థి వేగంముందు నిలవలేకపోయింది. ఇద్దరిమధ్యా 32 నిమిషాలపాటు సాగిన హోరాహోరీ పోరులో తై జు ర్యాలీస్‌ను ఎదుర్కోవడంలో సైనా విఫలమైంది. ఒక సమయంలో సెకండ్ గేమ్ స్కోరు 14-14 వద్ద సమం చేసినా, చివరి వరకూ కొనసాగించడం సైనావల్ల కాలేదు. స్కోరు సమమైన దగ్గర్నుంచీ చెలరేగిన తై జు, మరోసారి సైనాకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. బలమైన షాట్స్, ర్యాలీలతో 21-17, 21-14 స్కోరు సాధించి తైజు మ్యాచ్ సొంతం చేసుకుంది. తై జు ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటే, సైనా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మరో సెమీస్ మ్యాచ్‌లో జపాన్ సీడ్ అకానె యమగుచితో తలపడిన పీవీ సింధు అసాధారణ ప్రదర్శనతో భారత ప్రతిష్టను ఇనుమడించింది. కోర్టు నలుచెరుగులకూ చిరుతలా కదులుతూ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి అలసిపోయేలా చేసిన సింధు, 21-17, 15-21, 21-10 సెట్లతో వ్యూహాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్ పోరులో తై జుతో సింధు తలపడనుంది. పసిడి పోరులో సింధు విజయం సాధిస్తే, బాడ్మింటన్‌లో భారత్ చరిత్ర సృష్టించినట్టే. 1982 న్యూఢిల్లీలో నిర్వహించిన ఆసియా గేమ్స్‌లో పురుషుల విభాగం నుంచి సయ్యద్ మోదీ రజతాన్ని సాధించాడు. భారత్‌కు అదే చివరి పతకం. ఇప్పుడు సింధు ఫైనల్స్‌లో విజయం సాధిస్తే, బాడ్మింటన్‌లో భారత సత్తా మరో మెట్టెక్కినట్టే. ఆసియా బాడ్మింటన్‌లో భారత్‌కు కలగా మిగిలిపోయిన స్వర్ణాన్ని అందుకున్నట్టే. ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్స్‌కు చేరింది. స్కిప్పర్ రాణీరాంపాల్ హ్యాట్రిక్ గోల్స్‌తో థాయిలాండ్‌పై 5-0 స్కోరు సాధించి అప్రతిహతంగా సెమీస్‌కు చేరింది. ఇక సోమవారంనాటి బౌట్స్‌లో భారత బాక్సర్లు చెలరేగారు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో వికాశ్ కృష్ణ (75), అమిత్ పంగల్ (49 కేజీ), ధీరజ్ పంగి (64కేజీ)లు విజయాలు సాధించి తరువాత బౌట్లలోకి అడుగుపెట్టారు. కామనె్వల్త్ గేమ్స్‌లో రజతాన్ని సాధించిన మొహ్మద్ హుసాముద్దీన్ (56 కేజీ) విభాగంలో కిర్గిస్తాన్ బాక్సర్ ఎన్క్-అమర్ ఖర్కూ చేతిలో పరాజితుడయ్యాడు. టీం ఈవెంట్‌లో భారత పురుషుల స్క్వాష్ జట్టు ఇండోనేసియాపై 3-0తో విజయం సాధించింది. మహిళల జట్టు ఇరాన్‌పై 3-0తో విజయం సాధించింది. సైక్లింగ్, కరాటే విభాగాల్లో భారత పురుషుల, మహిళా జట్లు ఫైనల్‌కు అర్హత సంపాదించడంలో పూర్తిగా విఫలమయ్యారు. వాలీబాల్ పూల్ -బిలో మహిళా జట్టు సోమవారం చైనా చేతిలో 0-3తో ఓడి పోటీల నుంచి నిష్క్రమించింది. పూల్-బిలో భారత సెపత్‌కత్రా జట్టు నేపాల్‌పై 2-0తో విజయం సాధించినా, తదుపరి దశకు అర్హత సాధించలేక నిష్క్రమించింది. టీటీలో భారత్ రికార్డు నమోదు చేసింది. 1958లో ఆసియా గేమ్స్‌లో టీటీని ప్రవేశపెట్టిన దగ్గర్నుంచీ భారత్ ఒక్క పతకాన్ని సైతం సాధించలేదు. ప్రస్తుత ఆసియా గేమ్స్‌లో క్వార్టర్స్‌లో జపాన్‌పై 3-1తో విజయాన్ని నమోదు చేసిన భారత్, పతకాన్ని ఖాయం చేసుకుంది. ‘టీటీలో దేశానికే మొదటి పతకం లభిస్తోందన్న ఆనందం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది’ అని మ్యాచ్ అనంతరం ఆటగాడు ఆచంట శరత్‌కుమార్ వ్యాఖ్యానించాడు.