Others

కోరికలే కర్మలకు కారణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్యకామణిని చూసిన పురంజనునికి చాలా సంతోషం కలిగింది. నేను గొప్ప అందగాణ్ణి కనుక నన్ను తప్పక వరిస్తుంది. నేనే వెళ్లి మాట కలుపుతాను. అపుడు ఆమె నా గొప్పతనాన్ని తెలుసుకొంటుంది. నాకోర్కె నెరవేరుతుంది అనుకొన్నాడు. వెంటనే ఆమె చెంతకు వెళ్లాడు.
మాట కలిపాడు. ‘ఓ సుందరీ ఇంత అందగత్తెవైన నిన్ను ఈ పాము రక్షిస్తున్నదేమిటి? అసలు నీవు ఎవ్వరి కుమార్తె? మీ పురమెక్కడ? మీతండ్రి..’. ఇలా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆమె సౌందర్యాన్ని ఆపాద మస్తకం తనివితీరా చూస్తున్నాడు.
ఆ సౌందర్యవతి కూడా పురంజనుని అందానికి వశమైంది. ‘పురుషవరేణ్యా! నా గురించి నాకు అంతగా తెలియదు. ప్రస్తుతానికి ఈ పురంలో నేనుంటాను. ఇక్కడ కనిపించే పురుషులు నా ఆజ్ఞతో పనులు చేస్తూ ఉంటారు. వీరంతా కర్మచారులు. ఈ స్ర్తిలు నా చెలికత్తెలు. ఈ పాము నేను నిద్రిస్తున్నపుడు తాను మేల్కొని ఉండి ఈ నగరాన్ని రక్షిస్తూ ఉంటుంది. ’అని చెప్పింది.
పురంజనుడు ఎంతో సంతోషించి ‘ఓ భామినీ! నీవు అంగీకరిస్తే నేను నీ భర్త నవుతాను. నీకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకొంటాను. నిన్ను నా మహారాణిగా చేసుకొంటాను. కాలు కందకుండా నిన్ను నేనుకాపాడుకుంటాను.’అని చెప్పాడు.
పురంజనుని మాటలకు కామరూపిణి మహదానందపడింది.
వెంటనే వారిరువురికి వివాహం జరిగింది. ఆనాటి నుంచి పురంజనుడు ఆమెను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉన్నాడు. ఆమె కోరికలన్నీ తీరుస్తున్నాడు. తనలో కలిగే కోరికలనూ తీర్చుకుంటూ ఆ నవద్వారాలు కలిగిన పురాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలుకుంటూ వస్తున్నాడు.
కాలం కరుగుతూ ఉంది. సంవత్సరాలు గడిచిపోయాయి. ఏ సెలయేరు చూసినా, ఏ పచ్చిక బయలు చూసినా పురంజనుని దంపతులే. వారిద్దరూ అమితానందంతో జీవితాన్ని గడుపుతున్నారు.
రాణి నవ్వితే పురంజనుడు నవ్వుతాడు. ఆమె కలత నొందితే ఆయనా కలతనొందుతాడు. ఇలా రాణి మీద ఆధారపడి పురంజనుని జీవితం నడుస్తోంది. ఆమె ఒక్క క్షణమైనా పలుకక వౌనం వహిస్తే రాజు ఊరుకొండలేకపోతాడు.
అట్లాంటి రోజుల్లో రాణికి కోపం వచ్చింది. ఆమె చీనీచీనాంబరాలను వదిలి పట్టుపరుపులు విదిలించుకుని నేలపై పడుకుండి పోయింది. నల్లని కురులు ముడివేయక వదిలేసింది. మీనాలను పోలిన కన్నులు ఎర్రమందారాలైయ్యాయి. ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ఏకధాటిగా ఆమె కనులు కన్నీరు కారుస్తున్నాయి.
ఇలాంటి స్థితిలో ఉన్న రాణిని చూసిన పురంజనునికి కాలుసేతులు ఆడలేదు. వెంటనే ఆమె పాదాల దగ్గర కూర్చుని ఆమెను ఓదార్చాడు. ఎందుకు కోపం వచ్చిందో కనుగొన్నాడు. ఆమె మంచిమాటలతో మన్నన చేస్తున్నాడు. రాణికి కోపం తెప్పించిన వారిని ఖండఖండాలుగా నరికి పోగులు పెడతాను అన్నాడు. దానితో ఎంతో సంతోషించిన రాణి చిన్న చిరునవ్వు నవ్వింది.
వెంటనే పురంజనుని బాధ దూరమైంది. వెంటనే తన ఒడిలోకి రాణిని తీసుకొని ఎంతో అపురూపంగా చూస్తూ ఆమె లాలించాడు. రాణి కూడా పురంజనుని మాటలతో చక్కనైంది. తిరిగి యథావిధిగా రాజు రాణి ఆనందించసాగారు.
పురంజనుడు కాలక్రమంలో తండ్రి అయ్యాడు.
పురంజనునికి పదకొండు వందలమంది పుత్రులుదయించారు. నూటపదిమంది కుమార్తెలు కూడా కలిగారు. వారినంతా ఎంతో గారాబంగా పెంచాడు. వారికందరికి విలువైన విద్యలు నేర్పాడు. వారి వారి కోరికలను తీర్చడం కోసం పురంజనుడు ఎన్నో పనులు చేశాడు. వేటకోసం అడవుల వెంట తిరిగాడు. తన ఆనందం పొందడం కోసం విచక్షణను వదిలి ఎన్నో జంతువులను వేటాడాడు. మృగయావినోదం పేరిట చిన్న పెద్ద జంతువులు అన్న తేడా ల్లేకుండా అడవిలో వేటను కొనసాగించాడు.
ఇలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి.
*
- ఇంకావుంది...

డా. రాయసం లక్ష్మి