క్రీడాభూమి

15 మేరా భారత్..బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, సెప్టెంబర్ 1: ఉప ఖండం క్రీడా సంరంభం ముగింపు సమయంలో భారత్ మెరుపులు మెరిపించింది. ఒకేరోజు రెండు స్వర్ణాలు కైవసం చేసుకుని పతకాల పట్టికలో 8వ స్థానాన్ని నిలుపుకుంది. అంతా ఊహించినట్టే మిడిల్ వెయిట్ బాక్సింగ్‌లో భారత్ స్టార్ బాక్సర్ అమిత్ ఫంగల్ (49కేజీ) భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. భారత బాక్సింగ్ జట్టునుంచి ఫైనల్‌కు చేరింది 22ఏళ్ల ఆర్మీ కుర్రాడు అమిత్ ఒక్కడే. గత వరల్డ్ టోర్నీ ప్రత్యర్థి, ఒలింపిక్ ఆసియా చాంపియన్ హసన్‌బోయ్ దుస్మతోవ్‌ను 3-2 స్కోరుతో మట్టికరిపించి అమిత్ పసిడిని ఒడిసిపట్టాడు. గతేడాది వరల్డ్ చాంపియన్ టోర్నీలో అమిత్‌ను మట్టికరిపించి దుస్మతోవ్ రజతాన్ని సాధించడం తెలిసిందే. ‘గతేడాది అతని చేతిలో ఓడాను. ఇప్పుడు ప్రతీకారం తీరుకున్నా. కోచ్ శాంటియాగో, ఇతర కోచ్‌ల శిక్షణ బాగా ఉపకరించింది. సెమీఫైనల్‌లో తొలి రౌండ్‌ను అద్భుతంగా ఆడలేదు. ఆ తప్పులు ఫైనల్ బౌట్‌లో ఎక్కడా చేయలేదు. పూర్తిస్థాయిలో కౌంటర్ అటాక్‌కు దిగమన్న కోచ్ సూచన అద్భుతంగా పనిచేసింది’ అని అమిత్ వ్యాఖ్యానించాడు.
బ్రిడ్జిలో స్వర్ణం
గత ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టిన బ్రిడ్జి గేమ్‌లో భారత్ స్వర్ణం సాధించింది. పురుషుల పెయిర్ ఈవెంట్‌లో 60ఏళ్ల ప్రణబ్ బర్ధన్, 56 శిబ్‌నాథ్ సర్కార్ 384 పాయింట్లు సాధించి పసిడి పట్టుబడితే, 378 పాయింట్లతో చైనా, 374 పాయింట్లతో ఇండోనేసియా రజతం, కాంస్యం సాధించాయి. బ్రిడ్జి గేమ్‌లో భారత్ ఇప్పటికే రెండు రజతాలు సాధించడంతో, తాజా స్వర్ణంతో మూడు పతకాలు సాధించినట్టయ్యింది.
మహిళల స్క్వాష్‌కు రజతం
మహిళల స్క్వాష్‌లో ఫైనల్‌చేరి స్వర్ణంపై ఆశలు రేకెత్తించిన భారత జట్టు చివరకు రజతంతో సరిపెట్టుకుంది. పసిడి కోసం హాంకాంగ్ జట్టుతో అహరహం పోరాడినా, 0-2 ఫలితంతో చివరకు ఓటమిని అంగీకరించక తప్పలేదు. శనివారం జరిగిన సింగిల్స్‌లో సునన్య కురువిల్ల, భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్ జోత్స్న చిన్నప్ప ఘోర పరాజయాల కారణంగా భారత జట్టు మూడురోజుల కష్టం రజతానికే పరిమితమైంది. దీంతో 18వ ఆసియా గేమ్స్ స్క్వాష్ గేమ్‌లో భారత్ ఒక రజతం, నాలుగు కాంస్యాలతో తన సత్తా చాటుకుంది.
పురుషుల హాకీకి కాంస్యం
పురుషుల హాకీ కన్సోలేషన్ బ్రాంజ్ మ్యాచ్‌లో పాక్‌తో తలపడిన భారత జట్టు అద్వితీయ విజయంతో పతకాన్ని కైవసం చేసుకుంది. మ్యాచ్ ప్రారంభమైన మూడో నిమిషంలోనే అక్షదీప్ సింగ్ గోల్ సాధించడంతో భారత్ 1-0 ఆధిక్యానికి చేరింది. 50వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ మరో గోల్ సాధించడంతో ఆధిక్యం 2-0కు చేరింది. ఆట ముగింపు సమయంలో పాక్ ఆటగాడు మహ్మద్ అటిక్ గోల్ సాధించడంతో 2-1తో మ్యాచ్‌ను భారత్ కైవసం చేసకుని కాంస్యాన్ని సాధించింది.