స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-89

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావం:- మరణశీలుడనైన నేను నిన్ను శాశ్వతునిగా దలంచి స్వచ్ఛమైన హృదయంతో సన్నుతిస్తూ నినే్న పిలుస్తున్నాను. ఓ జాతవేద! తోడి జనులతో లేదా జనుల ద్వారా మాకు కీర్తిని ప్రసాదించు. ఓ అగ్నీ! నీ నుండి మేము ముక్తిని పొందెదము.
వివరణ:- జీవులు మృత్యువునకు ఆహారమైపోతూ ఉండటాన్ని చూచినపుడు జ్ఞాని నిర్వేదానికి లోనవుతాడు. అలా నిత్యమూ చూడగా చూడగా ఆ జ్ఞానికి ‘‘నేను మరణశీలుడనైన మనిషిని. నా ఆత్మతో దేహానికి ఎడబాటు తప్పదు అన్న జ్ఞానం దృఢపడుతూ ఉంటుంది. దానివలన ‘వియోగాంతాః హి సంయోగాః’ సంయోగాలకు తుది ఫలం వియోగమే ‘్భస్మాంత శరీరమ్’ (శుక్ల యజు.40-15) శరీరానికి అంతిమ పరిణామం భస్మం కావడమేనన్న శుక్ల యజుర్వేద బోధ అనుభవంలోనికి వచ్చి దేహాభిమానం నశిస్తుంది. ఫలితంగా అది ఆ జ్ఞాని హృదయాన్ని బంధించదు. ఆ రీతిగా ఆయనకు దేహంకంటె అతీతమైన తత్త్వమేదో ఉందన్న సత్యం ఎరుకలోనికి వచ్చి నశించే శరీరంలో ఉంటూ కూడ ఆత్మపరంగా మృత్యువునకాహారం కాదు. తాను అనగా తన ఆత్మఅమర్త్యం అనగా మరణమే లేని అమృతస్వరూపమన్న జ్ఞానం అతడికి సిద్ధిస్తుంది. నిత్యసత్యమిదే నన్న ఆత్మతత్త్వం గోచరమవుతుంది. అయినా ఆత్మకు అనిత్య శరీరంతో తాత్కాలికంగా కలిగిన సంగమంవలన కొంత వ్యాకులతకు లోనవుతాడు. అలా లోనయిన జ్ఞాని నీ గుణాలను హృదయంలో నింపుకొని నీకు శరణాగతుడవుతాడు. శరణాగతుడయి ఈ జగత్తునే మరచి పలుమార్లు నినే్న భక్తితో పిలుస్తాడు లేదా ధ్యానిస్తూ ఉంటాడు. జ్ఞానుల ఈ జీవనశైలిని గురించి ఋగ్వేదం ఈ మంత్రంలో ‘యస్త్వా హృదా.... జోహవీమి’ ‘‘మరణశీలుడనైన నేను నిన్ను అమృతస్వరూపునిగా విశ్వసించి పరిపూర్ణమైన భక్త్భివంతో నిరంతరం మరల మరల నినే్న పిలుస్తూ లేదా ధ్యానిస్తూ ఉంటాను’’అని జ్ఞాని ప్రార్థనగా వివరించాడు. ప్రార్థించడమే కాదు ‘‘ఓ జాతవేదా! నాకు యశము నిమ్ము. నాకే కాదు. మాకు యశమునిమ్ము. నిన్ను పిలిచేది లేదా ధ్యానించేది నా కొఱకు కాదు అందరి కొఱకు. ‘జాతవేదో యశో అస్మాసు ధేహి’అన్న మరో ప్రార్థన ద్వారా జ్ఞాని దయాహృదయాన్ని వేదం ప్రకటించింది. ‘కేవలాఘో భవతి కేవలాది’ (ఋ.10-117-6) ఎవరికి పెట్టక తానొక్కడే తినేవాడు కేవలం పాపానే్న భుజిస్తున్నాడు అని ఋగ్వేదంలో నీవే ఆదేశించి యున్నావు. మాకు అపకీర్తివద్దు. యశమే అనుగ్రహించు. ‘బాహుభ్యాం’ ‘యశోబలమ్’ అని నీవన్న ప్రకారం మాకు మా భుజాలలో యశోవంతులుకాగల శక్తినిమ్ము. నీవు దయాళుడవు అని జ్ఞాని సచ్ఛీలాన్ని వేదం ఆవిష్కరించింది. ఈ విషయానే్న కాదు వేదం మరొక విషయాన్ని కూడ వివరించింది.
యస్వై త్వం సుకృతే జాతవేద ఉ లోకమగ్నే కృణవః స్యోనమ్‌
అశ్వినం స పుత్రిణం వీరవంతం గోమంతం రయిం నశతే స్వస్తి॥ ఋ.5-4-11॥
భావం:- ఓ జాతవేద! జ్ఞానికి జీవితంలో సుఖాన్ని కలిగించేందుకు నీవు చేసే చిన్న రంధ్రం ద్వారా ఎన్నో సుఖాలు-్భగభాగ్యాలు ప్రవాహంగా వచ్చిపడతాయి. ఓ అగ్నీ! ఆ రంధ్రాన్ని నీవు మరికొంచెం పెద్దది చేయి. దాని ద్వారా నాకు కావలసినది భోగభాగ్యాలు కాదు. పుత్ర- మిత్ర- కళత్ర- పశ్వాది బంధుగణం కాదు. నాకు కావలసినది అమృతమ్= మృత్యురహిత జీవనం అంటే మోక్షం. కీర్తి అనిత్యం మరియు నశ్వరం. మేము కీర్తి చక్రంలో పడి పరిభ్రమించజాలం. మా అభిలాష దీనికి అతీతమైనది. ఓ అగ్నీ! మేము ముక్తిని పొందాలి. ‘అమృతత్వమస్యామ్’అన్నదే హృదయవాంఛితం. ధనధాన్యాలు- పుత్ర- మిత్రత కళత్రాదులు ఈ లోకంలోనే నిలిచి ఉండేవి. కాలక్రమంలో గాని అంత్యకాలంలో గాని బంధుజనం విముఖులై దూరంగాపోతారు. నేను వీరినుండి జ్ఞాన పూర్వకంగా విడుదల కావడాన్ని కోరుకొంటున్నారు. ఒంటరిగానా? కాదు కాదు. మేమందరమూ దానినే కోరుకొంటున్నాం. మేమంతా దుఃఖార్తులం. మృత్యు కబంధ హస్తాలకు చిక్కిపోయినవారం.
కాబట్టి మృత్యుముఖం నుండి విముక్తులను చేసి అమృతపానం చేయించు. ** ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు