తెలంగాణ

ఉస్మానియాలో ఏబీవీపీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పీడ వీడిందని పేర్కొంటూ ఉస్మానియా యూనివర్శిటీలో ఏబీవీపీ నేతలు హడావుడి చేశారు. ఆర్ట్సు కాలేజీ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. హామీలు ఇచ్చినా, నెరవేర్చకుండా విద్యార్థులను, నిరుద్యోగులను కేసీఆర్ మోసగించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మట్ట రాఘవేందర్ మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణకు విద్య, ఉద్యోగాల్లో మొండిచేయి చూపించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన పీడ వదిలిందని అన్నారు. యూనివర్శిటీల నాణ్యత, ఉన్నత విద్య పదేళ్లు వెనక్కు వెళ్లిందని అన్నారు. అసెంబ్లీలో వాగ్దానం చేసిన లక్షా ఏడువేల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కేసీఆర్ విద్యార్థులను, నిరుద్యోగులను నట్టేట ముంచారని అన్నారు.