తెలంగాణ

కేసీఆర్ అవకాశవాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశ వాది అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కే జానారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పోవడానికి కారణాలను సీఎం వివరిస్తూ, ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారని, ఇది చాలా దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆకాంక్ష సిద్ధికి కారణమైన కాంగ్రెస్ పార్టీపైనే కేసీఆర్ దుర్భాషలాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు.
అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే కుసంస్కారి అని అన్నారు. విజ్ఞులైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిశితంగా ఆయన తీరును గమనిస్తున్నారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించడంలో కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలదని చెప్పారు. తనపై వ్యతిరేకత పెరుగుతుందని గ్రహించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు.
ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం: పొన్నం
అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయమని సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కోరిన అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఎపుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో అపుడే సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు మొదలయ్యాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో చెప్పగలరా అంటూ టీఆర్‌ఎస్‌కు ఆయన సవాలు విసిరారు. గత ఎన్నికల సమయంలో హుస్నాబాద్‌కు ఇచ్చిన హామీలను కేసీఆర్ నేటి వరకూ అమలుచేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని, మెజార్టీకి అవసరమయ్యే సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.