క్రీడాభూమి

మరో విజయంపై ధోనీసేన కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌పై ఘనవిజయంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్న ధోనీ సేన బుధవారం ఐసిసి ట్వంటీ-20 టోర్నమెంట్‌లో భాగంగా ఇక్కడ బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో సైతం ఘనివిజయం సాధించి సెమీఫైనల్లో స్థానానికి మరో చేరువ కావాలని ఉవ్విళ్లూరుతోంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం తర్వాత తీవ్ర ఒత్తిడితో ఉన్న భారత్ ఈడెన్ గార్డెన్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనివిజయం సాధించడం ద్వారా తిరిగి గాడిలోపడినట్లు కనిపిస్తోంది. బుధవారం గ్రూపు 2 సూపర్ 10 మ్యాచ్‌లో గనుక విజయం సాధిస్తే జట్టు సెమీ ఫైనల్‌కు మరో అడుగు చేరువ కానుంది. మరోవైపు న్యూజిలాండ్ చేతిలో ఓటమి కారణంగా దెబ్బతిన్న తమ నెట్ రన్‌రేటును మెరుగుపర్చుకోవడానికి బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో విజయం సాధించాలని కూడా జట్టు భావిస్తోంది. మరోవైపు వరస ఓటములతోదాదాపుగా టోర్నమెంట్‌నుంచి నిష్క్రమించే ప్రమాదపుటంచుల్లో ఉన్న బంగ్లాదేశ్ గనుక బుధవారం జరిగే మ్యాచ్‌లో గనుక విజయం సాధించినట్లయితే సెమీ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు ఇంకా మిగిలే ఉంటాయి. అయితే రెండు జట్ల ప్రస్తుత ఫామ్‌ను గమనించినట్లయితే ధోనీ సేన స్పష్టమైన ఫేవరేట్‌గా కనిపిస్తుంది. అయితే భారీ టోర్నమెంట్లలో అనూహ్య విజయాలు సాధించే జట్టుగా బంగ్లాదేశ్‌కు పేరున్న విషయం తెలిసిందే.
బలమైన బ్యాటింగ్ జట్టుగా పేరొందిన టీమిండియాలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా లాంటి వారు ఇప్పటివరకు పెద్దగా రాణించకపోయినప్పటికీ విరాట్ కోహ్లీ అద్భుతమైన పామ్‌లో కొనసాగుతుండడం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. పై ముగ్గురిలో ఎవరు రాణించినా భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం. సొంత గడ్డపై ఆడుతున్న కారణంగా వారు ఏ క్షణాన్నయినా ఫామ్‌లోకి వస్తారని, అది బుధవారం మ్యాచ్‌లోనే జరుగుతుందని టీమ్ మేనేజిమెంట్ ఆశిస్తోంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్, ధోనీలు కూడా బాగానే రాణించారు. అయితే రోహిత్ శర్మ, ధావన్, రైనాలు వరసగా విఫలమవుతున్న నేపథ్యంలో రేపటి మ్యాచ్‌లో అజింక్య రహానేను ఆడించాలని జట్టు వ్యూహరచయితలు భావించే అవకాశాలు కూడా లేక పోలేదు. అలాగే జట్టులో అందరికన్నా ఎంతో అనుభవం ఉన్న స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను కూడా జట్టులోకి తీసుకొనే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు అంటున్నారు.
మరోవైపు ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించి ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్ ప్రపంచ ట్వంటీ 20 మెయిన్‌డ్రాకు అర్హత పొందినప్పటినుంచి నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. పేస్ బౌలర్ తస్కిన్ అహ్మద్, ఎడంచేతి వాటం స్పిన్నర్ అరాఫత్ సన్నీలు అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెండ్ కావడం ఆ జట్టును చావు దెబ్బ తీసింది. ఈ పరిస్థితుల్లో సోమవారం ఆస్ట్రేలియాపై రాణించిన ఆల్‌రౌండర్లు షకీబ్ అల్ హసన్, మహమ్మదుల్లాలపై కెప్టెన్ మషరఫే మొర్తజా కొండంత ఆశలు పెట్టుకున్నాడు. అలాగే తమీమ్ ఇక్బాల్‌ను కూడా జట్టులోకి తీసుకోవాలని జట్టు మేనేజిమెంట్ యోచిస్తోంది.మరో వైపు పేస్ బౌలర్ ముస్త్ఫాజుర్ రెహమాన్ గాయంనుంచి పూర్తిగా కోలుకుని జట్టులోకి రావడం కూడా జట్టుకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం మ్యాచ్‌పై అందరిలోను ఉత్కంఠ నెలకొనింది.