తెలంగాణ

టీఆర్‌ఎస్‌కే మళ్లీ అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, సెప్టెంబర్ 9: నాలుగేళ్ళ పాలనలో దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో చేసి చూపించామని, అభివృద్ధి పనులే టీఆర్‌ఎస్‌ను తిరిగి అధికారంలోకి తెస్తాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం వనపర్తిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు మరికొన్ని పథకాలను ప్రవేశపట్టిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించడంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా, కంటి వెలుగు తదితర పథకాలను విజయవంతంగా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌కు వంద సీట్లకు పైగా వస్తాయని తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఆంధ్ర పాలకులకు అమ్ముకుంటారని, కుక్కలు చింపిన విస్తరి చేస్తారని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే అనైతిక పొత్తులకు ఆరాట పడుతున్నారని ఆయన అన్నారు. ఆంధ్ర పాలకులు కోరితే సాగర్, శ్రీశైలం గేట్లను ఎత్తి వేసి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తప్పనిసరి పరిస్థితిల్లో ఇచ్చిందని , కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు కొట్లాడి , గిరిగిసి తెచ్చుకున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ సామర్థుడనే పట్టం కట్టారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ చరిష్మాకు తిరిగి పట్టం కడుతారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు రెండంకల సంఖ్య కూడా రాదని వారికి అధికారం కల్ల్ల అని, డిపాజిట్లు గల్లంతావుతాయని ఆయన చెప్పారు. ఎన్నికల మేనిపెస్టోలో మరిన్ని సంక్షేమ పథకాలను క్రోడీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, సింగిల్‌విండో అద్యక్షులు బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు