కృష్ణ

మానవతాధృక్పదాన్ని చాటుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 11: జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు మానవతా ధృక్పదాన్ని చాటుకున్నారు. నవ మాసాలు మోసి కని పెంచిన కుమారులచే ఇంటి నుండి గెంటేయబడ్డ ఓ వృద్ధురాలిని న్యాయమూర్తి అక్కున చేర్చుకున్నారు. వృద్దాప్యంలో అండగా నిలవాల్సిన వారే ఆ వృద్ధురాలైన తల్లిని ఇంటి నుండి బయటకు గెంటేసి ఆ కుమారులపై ప్రీలిటిగేషన్ కేసు నమోదు చేయించి ఆ వృద్ధురాలిని స్థానిక ఈడేపల్లిలోని ప్రభుత్వ వృద్ధ వికలాంగుల ఆశ్రమంలో చేర్పించారు. సర్కారుతోట శిరీష బొమ్మ సెంటరు సమీపంలో నివాసం ఉంటున్న చిలంకుర్తి వెంకట భారతమ్మకు నలుగురు కుమారులు. కుమారుల్లో ఒకడైన శ్రీనివాసరావు వద్ద ఉంటోంది. అయితే మంగళవారం ఉదయం శ్రీనివాసరావు తల్లితో గొడవపడి తీవ్రంగా కొడుతుండటంతో స్థానికులు గమనించి ఆ వృద్ధురాలిని పోలీసు స్టేషన్‌కు పంపారు. అయితే ఆ వృద్ధురాలు భారతమ్మ స్టేషన్ నుండి నేరుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసి తన గోడు చెప్పుకుంది. వృద్ధురాలి ఆవేదన విన్న న్యాయమూర్తి లక్ష్మణరావు స్పందించి ఆమె కుమారులందరిపై ప్రీ లిటిగేషన్ కేసు నమోదు చేయించి నోటీసులు జారీ చేయించారు.