కృష్ణ

రోడ్లను రక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): రహదారుల ఆక్రమణలపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పశువులను అదుపు చేసే చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ అధికారులకు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై ట్రాఫిక్ అడ్వైజరి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలో విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్, రహదారులపై ఆక్రమణలు, రాత్రి వేళల్లో ప్రయాణీకులకు ఇబ్బందికరంగా పశువులు తిరగడంపై పట్టణ ట్రాఫిక్ విభాగం వారు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారుల ఆక్రమణలపై టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో యధేచ్చగా జరుగుతున్న రహదారుల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని, రాత్రి వేళల్లో ట్రాఫిక్‌కు అడ్డంగా పశువులు తిరగడంపై పురపాలక సంఘంతో పాటు ట్రాఫిక్ అధికారులు, పోలసులు అధికారులు, ఆర్టీసీ వారు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పిజె సంపత్ కుమార్, డీఎస్పీ మహ్మద్ బాషా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వాసవి, ట్రాఫిక్ ఎస్‌ఐలు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

మహాగర్జనతో కనువిప్పు కలిగిస్తాం

మైలవరం, సెప్టెంబర్ 11: వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలో తలపెట్టిన మహాగర్జనతో పాలకులకు కనువిప్పు కలిగిస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు. వామపక్షాల ఆధ్వర్యంలో మహాగర్జనను విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర మంగళవార మైలవరం చేరుకుంది. ఈ యాత్రకు కమ్యునిస్టు నేతలు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా స్థానిక బోసుబొమ్మ సెంటరులో ఏర్పాటైన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ నెల 15న విజయవాడలో నిర్వహించనున్న మహాగర్జన సభ ద్వారా తృతీయ ఫ్రంట్‌కు అంకురార్పణ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని వదిలి భూస్వాములు, బూర్జువాలకు సహకరిస్తున్నాయని ఈ నేపధ్యంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఆవశ్యకత ఉందన్నారు. మహాగర్జన సభకు వేలాదిగా తరలి వచ్చి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మైలవరం పుర వీధులలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు పివి ఆంజనేయులు, జమలయ్య, రావూరి రామారావు, జానీ, సుధాకర్, సీపీఐ నేతలు సీహెచ్ కోటేశ్వరరావు, బుడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ద్వారా ఆర్థిక పరిపుష్టి

కూచిపూడి, సెప్టెంబర్ 11: బ్రాహ్మణ కార్పొరేషన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని కార్పొరేషన్ రాష్ట్ర పీఆర్‌ఓ ఈమని సూర్యనారాయణ, డైరెక్టర్ కాజ వెంకట శివరామ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. స్థానిక శ్రీ బాలా త్రిపుర సుందరి గ్రంథాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రూ.100 కోట్లు కేటాయించటమే కాకుండా పేద బ్రాహ్మణ కుటుంబాలకు రూ.8.2శాతం వడ్డీతో రూ.45వేలు ఎటువంటి హామీ లేకుండా సూక్ష్మ రుణాలు అందచేయటం ఆ వర్గాలు పట్ల సీఎం కనబరుస్తున్న విధానాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో బ్రాహ్మణులు అందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని వారు పిలుపునిచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య ఆదేశం మేరకు ప్రతి నియోజకవర్గంలో బలమైన బ్రాహ్మణ వర్గాలను గుర్తించి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించనున్నట్లు వారు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన బ్రాహ్మణ యువకులు రూ.100లు జీవిత కాలం సభ్యత్వం చెల్లించాలని, రూ.500ల షేర్ ధనాన్ని చెల్లించి సొసైటీలో సభ్యులుగా నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో మొవ్వ మండల సభ్యులు కెపిసి శర్మ, ఏలేశ్వరపు ఫణికుమార్ పాల్గొన్నారు.