తెలంగాణ

టీడీపీ ముసాయిదా మేనిఫెస్టో సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ముసాయిదా సిద్ధమైంది. మంగళవారం నాడు జరిగిన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఏడు ప్రధాన అంశాలను చర్చించారు. వ్యవసాయం - రైతులు, విద్య-వైద్యం, ఉపాధి-ఉద్యోగాలు, గ్రామపరిపాలన, నిరుద్యోగం, పరిపాలన -పారదర్శకత, సామాజిక న్యాయం- సమన్యాయం అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇచ్చిన హామీలకు పూర్తిగా కట్టుబడి ఉండే పార్టీ తెలుగు దేశం అనే భావన ఓటర్లకు ల్పించాలని, ప్రజల జీవనానికి అద్దంపట్టే విధంగా మేనిఫెస్టో ఉండాలని నిర్ణయించారు. పది రోజుల్లో మేనిఫెస్టో ముసాయిదాకు అసలు స్వరూపం ఇస్తారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధానకార్యదర్శి బండ్రు శోభారాణి మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతోందని అన్నారు. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీని నియమించిందని, కమిటీ సమావేశంలో పోలిట్‌బ్యూరో సభ్యులు టీ దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ గత 15 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల పక్షాన అనేక ఉద్యమాలు చేయడం జరిగిందని, పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతూ అనేక ప్రాంతాల్లో ఇచ్చిన హామీలను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని అన్నారు.