తెలంగాణ

దేశద్రోహులకు మద్దతిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: మహిళల అక్రమ రవాణా వంటి దేశ ద్రోహానికి పాల్పడిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి సునిత లక్ష్మారెడ్డి ఎలా మద్దతు ఇస్తారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. సైన్యంలో పని చేసానని చెప్పుకునే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేశ ద్రోహులకు మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. మంత్రిగా పని చేసిన సునితా లక్ష్మారెడ్డి మహిళల అక్రమ రవాణాకు వడిగట్టిన వ్యక్తికి మద్దతుగా మాట్లాడటం దారుణమని పద్మాదేవేందర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని, శాసనసభను మాత్రమే కాకుండా భార్యాపిల్లలను కూడా జగ్గారెడ్డి మోసం చేసారని పద్మాదేవేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు.