తెలంగాణ

చిగురిస్తున్న కొత్త పొత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ధీటైన పోటీ ఇచ్చేందుకు మహాకూటమి ఏర్పాటు దిశగా కాంగ్రెస్, టీడీపీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. కొత్త పొత్తుల గణాంకాలను విశే్లషిస్తున్న నేతలు కాంగ్రెస్, టీడీపీలు కలిసొస్తే టీఆర్‌ఎస్‌కు ముప్పుతప్పదని విశే్లషిస్తున్నారు. టీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకత కలిసొస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
వాస్తవానికి ఇంతకాలం టీడీపీ ఎన్నడూ ఒంటరిగా పోటీచేయలేదు, ఏదో ఒక పక్షంతో కలిసి పోటీ చేయడానికే అలవాటు పడింది. అదే సెంటిమెంట్‌ను తెలంగాణలో కూడా ఉపయోగించబోతోంది. ఈసారి తెలంగాణలో టీడీపీ తన ఉనికి చాటుకోలేకపోతే పార్టీని మూతవేసుకోక తప్పదనే సంకేతాలు రావడంతో పార్టీ మనుగడ కోసమైనా మహాకూటమితో పొత్తు అనివార్యంగా టీడీపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, వోటుకు నోటు కేసు, కేసీఆర్ ఆకర్ష మంత్రంతో పార్టీ క్యాడర్ చెల్లాచెదురు కావడంతో తిరిగి పార్టీని పునరుజ్జీవింపచేయాలంటే ఈసారి మహాకూటమితో కలవడం తప్పులేదనే భావనకు టీడీపీ నేతలు వస్తున్నారు. గతసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ ఐదు స్థానాలను కైవసం చేసుకోగా, టీడీపీ 15 స్థానాలను గెలుచుకుంది.
గెలుచుకున్న స్థానాల ప్రాతిపదికన చూస్తే టీడీపీ పొత్తుతో బీజేపీ ప్రయోజనం పొందిన దానికంటే బీజేపీ పొత్తుతో టీడీపీ ఎక్కువ ప్రయోజనం పొందింది. ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమికి కాంగ్రెస్‌కు దాదాపు సమానంగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 45 లక్షల ఓట్లు వస్తే బీజేపీ టీడీపీ కూటమికి 41 లక్షల ఓట్లు వచ్చాయి. తెలంగాణకు అనుకూల రాజకీయ వ్యూహాన్ని అనుసరించడంలో విఫలమైనా టీడీపీ ఆ ఎన్నికల్లో పరువు దక్కించుకుంది.
టీడీపీ 72 సీట్లకు పోటీ చేసి 15 అసెంబ్లీల్లో గెలవగా, బీజేపీ 45 చోట్ల పోటీ చేసి ఐదు గెలుచుకుంది. ఈ ఫలితాలతో టీడీపీకి సొంతగా బలం ఉన్నట్టు రుజువు చేసుకుంది. కాంగ్రెస్‌కు 25 శాతం ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు ఆ ఎన్నికల్లో 34 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ టీడీపీ కలిపి 21 శాతం ఓట్లు సాధించాయి. ఏ రకంగా చూసుకున్నా టీడీపీకి దాదాపు 15 శాతం ఓట్లు వచ్చాయని భావిస్తే తాజా మహాకూటమి ద్వారా టీడీపీ 15 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు వచ్చిన 25 శాతం ఓట్లు కలుపుకుంటే టీఆర్‌ఎస్‌కు ఆనాడు వచ్చిన 34 శాతం కంటే ఎక్కువనే లెక్కలను టీడీపీ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణలో ఫలితాలు తారుమారైపోతాయని, ఇంకో పక్క తెలంగాణలో గట్టిగా నిలదొక్కుకోవచ్చని టీడీపీ వ్యూహంగా ఉంది. దీనికి తోడు టీఆర్‌ఎస్‌పై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఆ ఓట్లు కూడా తమకు కలిస్తే ఎవరూ ఊహించని ఫలితాలే వస్తాయని చెబుతున్నారు.
అయితే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది, మరో పక్క ఓటర్లు మహాకూటమిని ఆమోదిస్తారా లేదా అన్న అంశమే ప్రాతిపదికగా ఫలితాల్లో ప్రస్ఫుటమవుతుందని భావిస్తున్నారు. ఇంకా మహాకూటమి ఏర్పాటుకు మరో వారం పది రోజులు పడుతుందని, అప్పటి కలయికలు, అభ్యర్థులు, మేనిఫెస్టోలు తదితర అంశాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. 2009లో అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ ఏకమైనా తమ ప్రభావాన్ని చూపలేకపోయాయి. అలాగే టీడీపీకి వ్యతిరేకంగా 2004లో విపక్షాలు ఏకమై తమ సత్తా చూపాయి. ప్రజల తీర్పు ఏర్పడిన కూటమి ప్రాతిపదికగా ఉంటుందనేది నిర్వివాదాంశమని చెబుతున్నారు.