అంతర్జాతీయం

వాణిజ్య బంధం మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: బలోపేతమైన సరికొత్త వాణిజ్య బంధాల కోసం భారత్-అమెరికా మధ్య ఉన్నత స్థాయి చర్చలు మొదలయ్యాయి. ఈ రెండు దేశాల మధ్య సరికొత్త వ్యాపార సంబంధాలు ప్రస్తుతం ప్రారంభదశలో ఉన్నాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన సీనియర్ అధికారులు తెలిపారు. రక్షణ శాఖలకు సంబంధించిన సుదీర వ్యాపార సంబంధాల కోసం గతవారం భారత రాజధాని న్యూఢిల్లీలో చర్చలు జరిగాయి. భారత్ సైన్యానికి అమెరికా సాంకేతిక సహాయానికి సంబంధించిన అంశాలు సైతం ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. దక్షిణ, మధ్య ఆసియా దేశాల విభాగం ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అలీస్ వెల్స్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమికంగా వ్యూహాత్మకమైన చర్చోపచర్చలు ఇరు దేశాల మధ్య సాగుతున్నాయన్నారు. ఇటీవలే భారత్ నుంచి అధికారుల బృందం చర్చల అనంతరం తిరిగివచ్చిందని, తదుపరి భారత్‌తో మరింత లోతైన చర్చలు సాగించేందుకు సిద్ధంగావున్నామని అధికారులు చెప్పారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారాశాండర్స్ మంగళవారం నాడిక్కడ విలేఖరులకు వివరించారు. ప్రత్యేకించి పరస్పరం ఇచ్చిపుచ్చుకునేలా పారదర్శకమైన వాణిజ్య బంధాల కోసం ఇరుదేశాలు కృషి చేస్తున్నాయన్నారు. ధరలతో కూడిన, సహకార విధానంతో దీరకాలిక వాణిజ్య బంధాల్లో అనుసరించాల్సిన విధానలపై స్పష్టత రావాల్సివుందన్నారు. మార్కెటింగ్ పరంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించే విషయంపై మరోవిడత ప్రత్యేక చర్చలు కొనసాగుతాయన్నారు. 2 ప్లస్ 2 పద్ధతిలో ఈ వాణిజ్య సంబందాల కోసం ఒప్పందాలు ఉండాలన్నది ఇరుదేశాల ఏకాభిప్రాయమన్నారు. ఎగుమతులకు సంబంధించి భారత్‌కు అమెరికా అతిపెద్ద గమ్యస్థానమని ఆమె తెలిపారు. 2017లో ఇరుదేశాల వాణిజ్య సంబంధాలకు 12మిలియన్ డాలర్ల కేటాయించగా ప్రస్తుతం ఆ మొత్తం 126 మిలియన్ డాలర్లకు చేరిందన్నారు. రెండు దేశాల పెట్టుబడులు 57 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరిందని అలిస్ వెల్స్ వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార రంగాల్లో తదుపరి పొరపొచ్చాలు, దాపరికంలేని ఒప్పందాల కోసం కృషి జరుగుతోందన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మా జీ కార్యదర్శి, ప్రస్తుత టాటా గ్రూప్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జయశంకర్‌తోనూ ఇదివరకే చర్చలు జరిగినట్లు తెలిపారు. అమెరికాకు ప్రస్తుతం భారత్ 9వ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉందని, ఈ బం ధాలు భవిష్యత్తులో మరింతగా బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.