తెలంగాణ

మళ్లీ ఎటిఎంల లూటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: కాపలా లేకుండా ఏర్పాటు చేసిన ఎటిఎంలను గుర్తు తెలియని దొంగలు మరోమారు లక్ష్యంగా చేసుకుని లూటీకి పాల్పడ్డారు. రామాయంపేట మండలం నిజాంపేట, పుల్కల్ మండలం శివ్వంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇండిక్యాష్ ఎటిఎంలపై దొంగలు విరుచుకుపడ్డారు. గ్యాస్ కట్టర్లతో ధ్వంసం చేసి నగదును అపహరించుకుపోవడం గమనార్హం. గతంలో ఒకే రోజు మూడు చోట్ల ఎటిఎంలపై దాడి చేసిన తొమ్మిది మంది ముఠా సభ్యులున్న హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు గత నెల 24వ తేదీన అరెస్టు చేసి 3 లక్షల నగదు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో దోపిడీ దొంగలు మరోసారి జిల్లాలోని ఎటిఎంలపై తమ ప్రతాపాన్ని చూపించి పోలీసులకు మరో సవాల్ విసిరారు. గత యేడాది మాసాయిపేట బ్యాంకులోని లాకర్ల దోపిడీ సంఘటనను పోలీసులు ఇంకా ఛేదించకముందే ఎటిఎంలను కొల్లగొడుతున్న సంఘటనలు తరుచు చోటు చేసుకుంటుండటంతో బ్యాంకర్లను, వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వరుసగా వారం రోజులపాటు బ్యాంకులకు సెలవులు రావడంతో ఎటిఎంలలో భారీ మొత్తంలో నగదు నిలువ ఉంటుందనే ఉద్దేశంతోనే బ్యాంకులు మూసివేసిన మొదటి రోజునే ఘాతుకానికి పాల్పడటం విశేషం. జహీరాబాద్, రామచంద్రాపూర్ ముత్తూట్ ఫైనాన్స్‌ల్లో చోరీకి సంబంధించిన కేసుల్లో పురోగతి లేకపోగా ఎటిఎంల దోపిడీలు వింతగొల్పుతున్నాయి. జాతీయ రహదారులతో పాటు పట్టణాల్లో విస్తృతంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా దొంగలు ఎంత మాత్రం భయడకుండా తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. నిజాంపేట ఎటిఎంలో సుమారు 1.5 లక్షలు తస్కరించి ఉంటారని ఎస్పీ సుమతి అభిప్రాయపడగా బ్యాంకు అధికారులు వస్తేకానీ పూర్తి వివరాలు వెల్లడికావు. పాత నేరస్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

హెచ్‌సియు అరెస్టులకు నిరసనగా ఢిల్లీలో ధర్నాలు
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిలో విద్యార్థులపై లాఠీచార్జి, అరెస్టులకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. బుధవారం ఢిల్లీలోని శాస్ర్తీభవన్ వద్ద ఉన్న మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యాలయం ముందు పెద్దఎత్తున విద్యార్థులు నిరసనకు దిగారు. హెచ్‌సియు విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యకు కారణమయిన విసి అప్పారావును శాశ్వతంగా తొలగించాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.