నల్గొండ

అపవిత్ర కూటమిని ప్రజలు ఆమోదించరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 12: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఇతర పార్టీలు కుదుర్చుకుంటున్న ఆపవిత్ర పొత్తులను రాష్ట్ర ప్రజలు ఆమోదించరని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్‌హాల్ బుధవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలల్లో తెలంగాణ సాధించి నాలుగున్నర ఏళ్లలోనే దేశానికే ఆదర్శంగా నిలిపిన టీఆర్‌ఎస్ తప్పా మరో పార్టీతో అవసరం లేదన్న భావన నెలకొందన్నారు. నాలుగేళ్ల తమ పాలన పట్ల ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నారని, ప్రజలు సంతృప్తిగా ఉన్నా ప్రతిపక్ష పార్టీలు తృప్తి చెందనంతా మాత్రన తమకు ఎలాంటి నష్టం జరగదన్నారు. గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమం కోసం ఇవ్వని అనేక పథకాలను అమలు చేశామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ త్వరలో విడుదల చేయనున్న మేనిఫెస్టో కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందన్నారు. ప్రతి పక్షాలు ఏకమైన, ఎన్ని కుట్రలు చేసిన రాష్ట్రంలో తమకు తిరిగి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నందున తమ గెలుపు నల్లేరు మీద నడకేనని ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చేసిన అభివృద్ధితో పాటు విపక్షాల కుట్రలు, అసత్య ప్రచారాలను పార్టీ శ్రేణులు బూత్‌స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతున్న నూతన ఓటర్‌ల నమోదు కార్యక్రమంలో టీఆర్‌ఎస్ శ్రేణులు ముందుండాలన్నారు. ఈనెల 15, 16 తేదీల్లో బూత్‌ల వారీగా ఓటర్‌ల నమోదు ప్రక్రియ ఉంటుందని నియోజకవర్గస్థాయిలో పది మంది సభ్యులతో బూత్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న 243 బూత్‌లకు ఏర్పాటుచేసిన కమిటీలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్‌ల నమోదు వివరాలు సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే నమోదైన లక్ష 94వేల పైబడి ఉన్న ఓటర్‌లను బూత్ కమిటీల వారు కలిసి టీఆర్‌ఎస్ ప్రభుత్వ విజయాలను వివరించేలా ప్రత్యేక శిక్షణనివ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, మార్కెట్ వైస్ చైర్మన్ కాకి కృపాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు గండూరి ప్రకాశ్, నేరళ్ల మధు తదితరులు పాల్గొన్నారు.