కృష్ణ

19న బందర్‌లో ‘జ్ఞానభేరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న కృష్ణా విశ్వవిద్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విశ్వవిద్యాలయం నూతన భవన సముదాయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న కృష్ణా విశ్వవిద్యాలయం నూతన భవన సముదాయం ముఖ్యమంత్రి తేదీ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. బందరు ఓడరేవు భూముల ప్రక్రియ కూడా కొలిక్కి వస్తుండగా ఓడరేవు నిర్మాణ పనులతో పాటు నిర్మాణాలు పూర్తి చేసుకున్న విశ్వవిద్యాలయం, ఉల్లిపాలెం-్భవానీపురం వారధిని సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పోర్టుకు భూములు ఇచ్చే రైతులకు పరిహారం చెల్లించే విషయంలో బ్యాంక్‌ల నుండి రుణం మంజూరుకు మరో నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో తొలుత వర్సిటీ భవనాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభింప చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు చేసిన కృషి ఫలించింది. పోర్టు శంకుస్థాపన, ఉల్లిపాలెం-్భవానీపురం వారధి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ నెలాఖరున నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సుమారు నాలుగున్నర యేళ్ల తర్వాత తొలిసారిగా చంద్రబాబు మచిలీపట్నం వస్తున్నారు. దీంతో సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర అత్యతంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన తేదీ ఖరారైందే తడువుగా విజయవాడ నుండి నేరుగా పట్టణానికి చేరుకున్న ఆయన వివిధ శాఖల అధికారులు, పార్టీ ముఖ్య నేతలతో ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావుతోపాటు ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, డీఎస్పీ మహ్మద్ బాషా, వివిధ శాఖల అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘జ్ఞానభేరి’ కార్యక్రమాన్ని కూడా మచిలీపట్నంలోనే నిర్వహించనున్నారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నం జిల్లాలో జ్ఞానభేరి నిర్వహించిన ప్రభుత్వం మూడవ విడత జ్ఞానభేరి కార్యక్రమాన్ని మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జ్ఞానభేరి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి సుమారు 10వేల నుండి 15వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీరితో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. అయితే సీఎం సభావేదిక విషయమై స్థల పరిశీలన జరుగుతోంది.

భళా ‘బొమ్మల శ్రీను’

బంటుమిల్లి 12: ప్రతి యేటా మాదిరిగానే ఈ ఏడాది కూడా స్థానిక చిత్రకారుడు ‘బొమ్మల శ్రీను’ తన గీతలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. బాడీ పెయంటింగ్‌తో ‘శహభాష్’ అనిపించుకోవడమే కాకుండా, పెండ్లి తంతులో వినియోగించే గరికముంతపై దోస గణపతి, బాల గణపతి, హరిత గణపతి చిత్రాలకు ప్రాణం పోశాడు.