తెలంగాణ

చొప్పదండి టీఆర్‌ఎస్‌లో టెన్షన్..టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, సెప్టెంబర్ 18: రాష్టవ్య్రాప్తంగా 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. చొప్పదండి సిట్టింగ్ స్థానానికి ప్రకటించక పోవటంతో నియోజకవర్గంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ మేరకు మొదటి నుంచి పార్టీలో వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే శోభపై పలుమార్లు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు ఇంటలిజెన్స్ ద్వారా నేరుగా కేసీఆర్‌కు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఎక్కడా కూడా కేసీఆర్, మంత్రులు, ఎంపీల పేర్లు చెప్పకపోవటం, ప్రభుత్వ పథకాలను తానే స్వయంగా ఇస్తున్నట్లు చెప్పుకోవటం, అదిష్ఠానం నిర్ణయాలను వ్యతిరేకించడం, ద్వితీయ శ్రేణి నాయకులను దూరం పెట్టడం, అధికారులపై దురుసుగా వ్యవహరించడం తదితర పరిణామాలను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలోనే శోభకు టికెట్ ప్రకటించకుండా చేశాయన్నది సమాచారం. ఈ నేపథ్యంలోనే శోభకు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఒకరిద్దరు మొదట అండగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వారు కూడా నేరుగా టికెట్ వద్దంటూ చెప్పటంతో ఇక శోభకు చెక్ పెడతారనే చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే శోభ మాత్రం తన పట్టు విడవకుండా అటు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్‌ల ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. వారి నుంచి సరైన మద్దతు లభించటం లేదనేది సమాచారం. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయిన్‌పల్లి, కొడిమ్యాల, మల్యాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్‌లు, మార్కెట్ చైర్మన్‌లు పూర్తిగా వ్యతిరేకిస్తుండటంతో పాటు సీనియర్ నాయకులు సైతం శోభకు వ్యతిరేకంగా మారటంతో అధిష్ఠానానికి టికెట్ మార్చడానికి పని ఇంకా సులువైందన్న ప్రచారం నెలకొంది. గత మూడు నాలుగు రోజులుగా శోభ అనుచర వర్గంలో కొందరు శోభకే టికెట్ ఇవ్వాలని కోరుతుండగా, నియోజకవర్గంలో బలమైన ద్వితీయ శ్రేణి ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడిగా శోభకు ఇవ్వకుండ ఎవ్వరికిచ్చినా గెలిపించుకుంటా మంటూనే, స్థానిక నాయకులకు ఇవ్వాలని బహిరంగంగానే చెబుతుండటంతో ఇక శోభకు టికెట్ నల్లేరుమీద నడకే అంటున్నారు. పలువురు నేతలు మండలాల్లొ స్థానికుడైన రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌కు ఇవ్వాలనే సంకేతాలు మెండుగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల్లొ కేసీఆర్ చొప్పదండి అభ్యర్థిని ప్రకిటిస్తారనే సమాచారం ఉంది. శోభ వర్గీయుల్లో కొందరు, ఇటు సుంకె రవిశంకర్ వర్గీయులు పోటా పోటీగా టికెట్ ఇవ్వాలంటూ చెబుతుండటంతో ఆసక్తి నెలకొంది.