క్రీడాభూమి

టి-20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కు వాట్సన్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్‌లో 59 టెస్టులు ఆడిన వాట్సన్ 3,731 పరుగులు చేశాడు. 75 వికెట్లు పడగొట్టాడు. 190 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 5,757 పరుగులు సాధించాడు. 168 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టి-20 ఇంటర్నేషనల్స్‌లో ఇప్పటి వరకూ 1,400 పరుగులు చేసి, 46 వికెట్లు కూల్చాడు. 2007, 2015 సంవత్సరాల్లో ప్రపంచ కప్‌ను సాధించిన ఆస్ట్రేలియా జట్టులో వాట్సన్ సభ్యుడు. టి-20 వరల్డ్ కప్ ఆరంభం నుంచి అతను ప్రతిసారీ ఈ టోర్నీకి హాజరవుతున్నాడు. వరుసగా ఆరో పర్యాయం అతను ఆడుతున్నాడు.

--

మొహాలీ, మార్చి 24: ఇప్పుడు జరుగుతున్న టి-20 వరల్ట్ కప్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ప్రకటించాడు. పాకిస్తాన్‌తో శుక్రవారం జరగాల్సిన మ్యాచ్ కోసం సహచరులతో కలిసి అతను నెట్స్‌లో పాల్గొన్నాడు. అంతకు ముందు అతను జట్టులోని సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ రిటైర్మెంట్ వార్తను వెల్లడించాడు. 14 సంవత్సరాల క్రితం, దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో సరిగ్గా ఇదే రోజు జరిగిన వనే్డతో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన విషయాన్ని అతను గుర్తుచేసుకున్నాడు. అనంతరం అతను విడుదల చేసిన ఒక ప్రకటనలో రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. గత ఏడాది ఇంగ్లాండ్‌తో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను ఆడిన తర్వాత టెస్టు క్రికెట్ నుంచి రిటైరైన 34 ఏళ్ల వాట్సన్ చివరి వనే్డను ఇంగ్లాండ్‌పై లార్డ్స్ మైదానంలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఆడాడు. టి-20 స్పెషలిస్టుగా ముద్రపడిన అతను ఆ ఫార్మెట్‌లోనే ఆస్ట్రేలియా జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. గ్లేన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, రికీ పాంటింగ్, ఆడం గిల్‌క్రిస్ట్ వంటి ఆసీస్ లెజెండ్స్‌తో కలిసి ఆడిన అదృష్టం అతనికి లభించింది. క్రికెట్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాలను సంపాదించుకున్న అసాధారణ ఆటగాళ్లతో కలిసి ఆడడాన్ని తన పూర్వజన్మ సుకృతంగా అతను అభివర్ణించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించినంత కాలం తాను అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేసినట్టు చెప్పాడు. కుటుంబ బాధ్యతలతోపాటు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయంతోనే తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు చెప్పాడు. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్), బిగ్‌బాష్ టోర్నీల్లో ఆటను కొనసాగిస్తానని అన్నాడు. ఈఏడాది ఐపిఎల్ వేలంలో అందరి కంటే అధికంగా అతనికి 9.5 కోట్ల రూపాయలు లభించిన విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతనిని వేలంలో కొనుగోలు చేసింది.
క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులతో విభేదించడం, అలగడం, టోర్నీలకు దూరం కావడం వాట్సన్‌కు అలవా టుగా మారింది. ఎన్నిసార్లు ఘర్షణ పడినా, సమర్థుడైన ఆల్‌రౌండ్ కాబట్టి ప్రతిసారీ సిఎ అధికారులు, సెలక్టర్లు రాజీకి వస్తున్నారు. వాట్సన్ కూడా మరీ బెట్టు చేయకుం డా రాజీ సూత్రానికి సానుకూలంగా స్పందించి, జట్టులో కొనసాగుతున్నాడు.