తెలంగాణ

రిజిస్ట్రేషన్ల శాఖకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు మహర్దశ పట్టింది. రాష్ట్రంలోని 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. పాత రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించింది. పాత రికార్డులను భద్రపరచడం, సేవలను సత్వరమే అందించాలనే సంకల్పంతో డిజిటలైజేషన్‌కు రూ. 22.10 కోట్లను వచ్చే ఏడాది బడ్జెట్‌లో కేటాయించారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఆధునీకరణకు ప్రణాళిక పద్దు కింద మొత్తం రూ. 82.10 కోట్లను కేటాయించారు. గత ఏడాది ఈ శాఖలో భవనాల నిర్మాణం కోసం రూ. 60 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. ఇందులో రూ. 5.55 కోట్లను బడ్జెట్‌ను కేటాయించారు.
2016-17 ఆర్ధిక సంవత్సరానికి స్టాంపు లు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ. 4291 కోట్ల ఆదాయాన్ని సేకరించాలని నిర్దేశించారు. 2014-15లో రూ. 3972 కోట్ల ఆదాయాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ. 2531.07 కోట్ల ఆదాయం వచ్చింది. 2015-16లో రూ. 3700కోట్లను సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతవరకు రూ. 3329 కోట్ల రెవెన్యూను సాధించారు. ఒక ఎస్‌ఆర్‌ఒ పరిధిలో ఉన్న ఆస్తిని అదే రిజిస్ట్రేషన్ జిల్లాల్లోని ఏ ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. మీ సేవా సేవల కింద ఎన్‌కంబరెన్స్ సర్ట్ఫికేట్లు, ధృవీకృత ప్రతుల జారీ సేవలను అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర డేటా సెంటర్‌లో సెంట్రల్ సర్వర్‌కు అన్ని వివాహ రిజిస్టార్ కార్యాలయాలను అనుసంధానం చేశారు.