అంతర్జాతీయం

చైనా యుద్ధ సన్నాహాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 30: చైనా యుద్ధ సన్నాహాలు చేస్తున్నది. ఏ దేశంపైకి కాలుదువ్వుతుందో లేక ఏ దేశం నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిందోగానీ ఆయుధ బలాన్ని పరీక్షించుకుంటున్నది. ఇటీవలే మూడు హైపర్‌సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్స్‌ను పరీక్షించించిందని చైనా మీడియా ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. శబ్ద తరంగాల కంటే వేగంగా ప్రయాణించే ఈ హైపర్‌సోనిక్ విమానాలను ఈనెల 21న జిక్యువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్‌లో పరీక్షించిన సీసీటీవీ ఫుటేజీలను చైనా మీడియా బహిర్గతం చేసింది. డీ18-1ఎస్, డీ18-2ఎస్, డీ18-3ఎస్ అనే మూడు రకాలైన హైపర్‌సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది. వీటి వేగాన్ని బేస్ నుంచే నియంత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తున్నది. అణ్వస్త్రాలను కూడా మోసుకుపోయే శక్తిసామర్థ్యలు వీటికి ఉన్నాయని సమాచారం. ఎంత దూరంలోని, ఎలాంటి లక్ష్యాన్నయినా ఛేదించే ఈ హైపర్‌సోనిక్ విమానాలను అడ్డుకోవడం శత్రుదేశాలకు చాలా కష్టం. కాగా, గత నెల చైనా సైంటిస్టులు స్టారీ స్కై-2 పేరుగల ఒక సైపర్‌సోనిక్ గ్లైడర్‌ను సమర్థంగా పరీక్షించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, ఎయిర్‌క్రాఫ్ట్‌ల శక్తి సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ విమానాలు, శబ్ద వేగానికి సుమారు ఆరు రెట్లు వేగంతో, అంటే గంటకు 7,344 కిలోమీటర్ల వేగంతో దూసుకెళతా యి. లక్ష్యాలకు అత్యంత సమీపానికి వెళ్లి, ఆయుధాలను ప్రయోగిస్తాయి. ఇంతటి అత్యాధునిక హైపర్‌సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను చైనా ఎందుకు పరీక్షించందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఏ సమయంలోనైనా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని శత్రు దేశాలను హెచ్చరించడానికే ఈ ప్రయత్నం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.