డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజసూయ యాగానికి ముందు శ్రీకృష్ణుడు జరాసంధుని సంహరించడానికి తగిన సమయ మని భావించాడు. అతను యుధిష్టరునితో ఇలా అన్నాడు. ’’ హంస డింభకులు ఇప్పటికే నాశనం అయ్యారు. కంసుడు చంపబడ్డాడు. కనుక జరాసంధ వధకు ఇదే సరైన సమయం. అతన్ని బాహుబలంతోనే చంపాలి. నాలో రాజనీతి ఉంది. భీమునిలో బాహుబలం ఉంది. అర్జునునిలో రక్షణ సామర్థ్యం ఉంది. కనుక మనం జరాసంధుని ఆణచివేయగలం. ఏకాంతంలో మనం అతన్ని అడిగితే అతను తప్పకుండా మనలో ఒకరితో యుద్ధానికి ఒప్పుకుంటాడు. బాహుబలంతో గర్వితుడైన అతను భీముని తోనే యుద్ధానికి సిద్ధమగును. సమాన బలం కల భీముడు అతన్ని వధించగలడు. కనుక నాపై నమ్మకముంచి భీమార్జునులను నాతో పంపు.
యుధిష్టరుని అనుమతి తీసుకొని కృష్ణార్జును లు, భీమసేనుడు కలిసి మగద రాజైన జరాసం ధుని రాజధానికి వెళ్ళారు. వారు ముగ్గురు బ్రాహ్మణ రూపాల్లో వెళ్ళారు. ఆ సమయంలో వారు సూర్యచంద్రుల్లా ప్రకాశించారు. యుద్ధంలో పరాజయమెరుగని నరనారాయణులైన ఆ కృష్ణార్జునులు జరాసంధ వధ అనే కార్యాన్ని సాధించే ఉద్దేశ్యంతో కురుదేశాల నుంచి బయలుదేరి కురుజంగాలం మధ్యలో పద్మ సరోవరాన్ని చేరారు. తర్వాత ఒకే పర్వతంపై ప్రవహించే గండకి, సదానీర అనే నదులను దాటి ముందుకు ప్రయాణం చేశారు. తరువాత కోసల దేశాన్ని దాటి మిథిలను చేరి, గంగ, శోణ నదులను దాటి వారు మగధ రాజ్యం లోకి ప్రవేశించారు. ఆ నగర ళోభను శ్రీ కృష్ణుడు భీమార్జునులకు ఈ విధంగా వర్ణించి చెప్పాడు.
‘‘ఈ మగధ రాజధాని జల సమృద్ధితో, పశు సంపదతో, సుందర భవనాలతో, ఉద్యాన వనాలతో అత్యంత సుందరంగా ఉంది. అక్కడ విపులం, వరాహఋషభం, ఋషిగిరి చైతన్యం అనే ఐదు పర్వతాలు ఉన్నాయ. ఇక్కడే గౌతమ మహర్షి నివసిస్తున్నాడు. అతని ఆశ్రమం సమీపంలో అనేక శుభప్రదమైన వృక్షాలు ఉన్నాయ. ఇక్కడి పర్వతాలపై సిద్ధులకు ఋషులకు ఆశ్రమాలు ఉన్నాయ. ఇక్కడ గజ సంపద ఎక్కువగా ఉంది. ఈ సాటి లేని సంపదల చేత జరాసంధుడు గర్వించి ఉన్నాడు. ఆ జరాసంధుని నగరంలో చాతుర్వర్ణాల వారు సుఖసంతోషాలతో ఉన్నారు.’’
ఇలా మాట్లాడుతూ వారు నగరంలోకి ప్రవేశించారు. పూర్వరాజు బృహద్రథుడు ఋషభుడనే రాక్షసుని సంహరించి అతని చర్మంతో మూడు నగారాలు నిర్మించాడు. ఒకసారి మ్రోగిస్తే అవి నెలవరకూ మ్రోగుతూనే ఉంటాయ. అవి మ్రోగినప్పుడు పుష్ప వృష్టి కురుస్తుంది. వారు ఆ భేరీలని చీల్చి చైత్య ప్రాకా రం ఎక్కారు. వారు ఆ వర్ణ శిఖరాన్ని పడగొట్టి నగర రాజధానియైన గిరివ్రజంలోకి ప్రవేశించారు.
ఆ సమయంలో వేద విదులైన బ్రాహ్మణులకు దుశ్శకునాలు కన్పించగా వారు రాజుకు చెప్పారు. వారు రాజుని ఏనుగుపై కూర్చుండ బెట్టి చుట్టూ నీరాజనాలతో అగ్నిని ప్రజ్వలింపచేశారు. అదే సమయంలో బ్రాహ్మణ వేషధారులై కృష్ణార్జున భీమసేనులు నగరంలోకి ప్రవేశించారు. వారు ప్రవేశించి మాలలు ధరించి నిర్భయంగా జరాసంధుని దగ్గరకు వచ్చారు. జరాసంధుడు వారిని బ్రాహ్మణులుగా తలచి వారికి అతిధి సత్కారాలు చేశాడు. వారికి స్వాగతం పలికాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు అతనితో ఇలా అన్నాడు. ‘‘రాజా వీరు నియమంలో ఉన్నారు. అర్ధరాత్రికి ముందు నీతో మాటలాడరు.’’
జరాసంధుడు వారిని యాగశాలలో ఉంచి అర్ధరాత్రి సమయంలో వారి దగ్గరకు వచ్చాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న వారిని కూర్చోమనగా వారు ఆశీనులయ్యారు.
అనంతరం రాజు వారితో ఇలా అన్నాడు. ‘‘విప్రులారా! స్నాతకవ్రతం పాలించే బ్రాహ్మణులు మాలల ధరించరు. మీ మెడలో మాలలు కలవు. భుజాలపై వింటి నారిని ధరించిన గుర్తులు కలవు. మీరు క్షత్రియ తేజం కలవారు బ్రాహ్మణులమని చెప్తున్నారు. ఇలా లేపనాలు పూసుకొని మాలలు ధరించడం రాజులకు మాత్రమే శోభనిస్తుంది. కనుక మీరెవరో నిజం చెప్పండి. చైత్య పర్వత శిఖరం పగులగొట్టి ఈ వేషాలతో రాజధాలోనికి నిర్భయంగా వెనుక వాకిలి గుండా ఏ కారణం చేత ప్రవేశించారు? బ్రాహ్మణుల పరాక్రమం చేతల్లో ఉండదు. మీరు నాదగ్గర పూజను ఎందుకు గ్రహించరు? ఏ ప్రయోజనం ఆశించి నా దగ్గరకు వచ్చారు?’’
అప్పుడు శ్రీ కృష్ణుడు గంభీరంగా ఇలా అన్నాడు. ‘‘రాజా నీవు మా వేషం చూసి బ్రాహ్మణులమని అనుకున్నావు. బ్రాహ్మణ, క్షత్రియ వైశయులు ముగ్గ్గురకూ స్నాతక వ్రతం ఉంటుంది కదా. ఈ మ్మడు వర్ణాల వారు కొన్ని నియమాలను పాటిస్తారు. ఎవరు పువ్వులు ధరిస్తారో వారు సంపద పొందుతారు. కనుక మేము మాలల ధరించాము.
క్షత్రియులు బాహుబల సంపన్నులు. వారి బలం వారి భుజాల్లో ఉంటుంది. అది నేడు చూడాలంటే ఈ రోజే చూస్తావు. ఇంకా ధీరులు శతృవుల గృహాల్లోకి ముందు గుమ్మాలనించి ప్రవేశించరు. మిత్రుల ఇండ్లకు మాత్రమే అలా ప్రవేశిస్తారు. మేము కార్యార్థులమై నీ ఇంటికి వచ్చాము. కనుక శత్రువు అయన నీ నుండి ఏ సత్కారాన్ని గ్రహించము. ఇది మా వ్రతం.’’
జరాసంధునికి వారి మాటలు గురించి ఎంత ఆలోచించినా వారి వైర కారణం అర్థం కాలేదు. అదే మాట వారితో అన్నాడు ‘‘బ్రాహ్మణులారా! నేను మీకు ఏ అపకారమూ చేయలేదు. ధర్మానికి హానికలిగితే మనస్సుకు దుఃఖం కల్గుతుంది. ధర్మాత్ముడైన క్షత్రియుడు నిరపరాధి పట్ల ఇలా వైరం పూనడు. సజ్జన ధర్మాన్ని పాలించే వారికి మూడు లోకాల్లో క్షత్రియ ధర్మం శ్రేష్ఠమైనది. నేను మనస్సును నిగ్రహించి స్వధర్మ పాలన చేస్తున్నాను. ప్రజలను కూడా చక్కగా చూసుకుంటున్నాను. మరి నా పట్ల మీకు శతృత్వం ఎందుకు?’’
శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు. ‘‘మహాబాహు! సదృశంలో ఒక్కడే వంశ భారాన్ని వహిస్తాడు. అలాటి మహాపురుషుని ఆజ్ఞపై నిన్ను శిక్షించటానికి వచ్చాము. నీవు ఎంతోమంది రాజులను బందీలుగా చేశావు. అంత పెద్ద తప్పుచేసి నీవు నిరపరాధివి అని అనుకుంటున్నావు? నీవు వారిని రుద్రునికి బలి ఇద్దామనుకుంటున్నావు. శుభంకరుడైన శంకరుని పూజించటానికి ఇంత హింస అవసరమా? నీ బుద్ధి నశించింది. వారంతా నీలాంటి రాజులే. క్షత్రియులే. వారిని బలిపశువులను చేస్తున్నావు నీవు క్రూరుడవు. మేము ధర్మరక్షణ లో సమర్ధులం. ఆపదలో ఉన్న వారికి రక్షణ కల్పిస్తాం.
ధర్మాత్యుడైన రాజు ఇతర రాజులను చంపుతాడా? క్షత్రియుడు యుద్ధంలో మరణించి స్వర్గాన్ని పొందుతాడు. కనుక మాతో చేసే యుద్దంలో నీకు స్వర్గం లభిస్తుంది. తమ కంటే ఉత్తములను అవమానించేవారు నశిస్తారు. నీ గర్వాన్ని, అహంకారాన్ని మేము సహించము. నిశ్చయంగా నీతో యుద్ధం కోరే మేము ఇక్కడికి వచ్చాము నేను వసుదేవ పుత్రుడను, కృష్ణుడను వీరిరువురు భీమార్జునులు. నేను నీకు శత్రువును.’’ అది విని జరాసంధుడు ఇలా అన్నాడు. ‘‘శ్రీకృష్ణా! యుద్ధంలో నేను జయంచిన రాజులనే బందీ చేశాను. క్షత్రియునికి ఇలా చేయడం ధర్మ బద్ధమే. నేను నా పరాక్రమంతో రాజులను జయంచి, వారిని దేవతలకు కానుకగా బలివ్వడానికి తెచ్చి ఇప్పుడు మీ భయంతో ఎలా వదిలిపెడ్తాను? నేను మీ ముగ్గురితో కలిసిగాని విడివిడిగా కాని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.’’ ఇలా వారితో చెప్పి జరాసంధుడు తన కుమారుడైన సహదేవుని పట్ట్భాషేకానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి